Prasanth Varma: ‘హనుమాన్‌’ చేయాలనుకున్నానన్న చిరంజీవి.. ప్రశాంత్‌ వర్మ ఎమోషనల్‌ పోస్ట్‌

‘హనుమాన్‌’ (Hanuman)ను ఉద్దేశించి చిరంజీవి (Chiranjeevi) చేసిన వ్యాఖ్యలపై చిత్ర దర్శకుడు ప్రశాంత్‌ వర్మ (Prasanth varma) స్పందించారు.

Updated : 13 Apr 2024 13:36 IST

హైదరాబాద్‌: హనుమాన్‌ పేరుతో గతంలో ఓ సినిమా చేయాలనుకున్నానని.. తేజ సజ్జా (Teja Sajja) నటించిన ‘హనుమాన్‌’ (Hanuman) చూశాక తానెంతో సంతృప్తి చెందానని అగ్రకథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) ఇటీవల అన్నారు. ఆ వ్యాఖ్యలపై ఆ చిత్ర దర్శకుడు ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma) భావోద్వేగానికి గురయ్యారు.

‘‘హనుమంతుడి కథ నేపథ్యంలో సినిమా చేయడం పద్మవిభూషణ్‌ చిరంజీవికి డ్రీమ్‌ అని విని ఎంతో సంతోషంగా అనిపించింది. ఆయన మాటలు నాపై మరింత బాధ్యత పెంచాయి. ఈ క్షణాలను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా. ఈ వీడియో చూసి కన్నీళ్లు ఆగలేదు. తేజ ఇప్పుడు ఏవిధంగా ఫీల్‌ అవుతున్నాడో ఊహించగలను’’ అని ‘ఎక్స్‌’లో పోస్ట్‌ పెట్టారు.

ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, ఆహా సంస్థలు సంయుక్తంగా సౌత్‌ ఇండియా ఫిలిం ఫెస్టివల్‌ని మార్చి నెలలో నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మీకు అవకాశం వస్తే ఎలాంటి సినిమాలో నటిస్తారు..? అని చిరును అడగ్గా.. ‘‘మీరు అక్కడ కూర్చొన్న వ్యక్తి (తేజ సజ్జను చూపిస్తూ..)ని చూశారా.? అతను హను-మాన్‌’ చేశాడు. అదే పేరుతో నేను ఒక సినిమా చేయాలని ఎప్పుడో అనుకున్నా. ఈ సినిమా చూశాక నాకు చాలా సంతృప్తి అనిపించింది. నేను తనని వేరుగా చూడటం లేదు. అతను నా ప్రయాణంలో ఒక భాగం. తనని తాను నిరూపించుకున్నాడు. ఇప్పుడు యావత్‌ భారతదేశం అతడి నటనను మెచ్చుకుంటోంది’’ అని చిరంజీవి బదులిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా విడుదలైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని