Prashanth Neel: ఆయనలా ఎవరూ సినిమాలు తీయలేరు: ప్రశాంత్‌నీల్‌

Prashanth Neel: కన్నడ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రశాంత్‌ నీల్‌ తన అభిమాన దర్శకుడు ఎవరో చెప్పారు.

Updated : 27 Feb 2024 14:22 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో క్రేజ్‌ ఉన్న దర్శకుల్లో ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) ఒకరు. ‘కేజీయఫ్‌’ చిత్రాలతో తనతో పాటు, కన్నడ చిత్ర పరిశ్రమకు మంచి పేరు తీసుకొచ్చారు. తాజాగా ఓ  కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కన్నడ నటుడు ఉపేంద్ర (upendra) తన అభిమాన దర్శకుడని అన్నారు. ఆయనలా ఎవరూ సినిమాలు తీయలేరని ప్రశంసలు కురిపించారు.

‘‘నేను కన్నడ కార్యక్రమంలో ఉన్నాను కాబట్టి ఈ మాట చెప్పడం లేదు. నాకు నచ్చిన దర్శకుడు ఉపేంద్ర. ఆయనలా సినిమాలు తీయడం ఎవరికీ సాధ్యం కాదు. కథ చెప్పే విధానం, వాటిని తెరపై ఆవిష్కరించే తీరు చాలా విభిన్నంగా ఉంటుంది. ‘ఏ’, ‘ఓమ్‌’, ‘ష్‌..’. ‘ఉపేంద్ర’ సినిమాలు చూస్తే, ఇలా కూడా తీసి హిట్‌ కొట్టొచ్చా? అని నిరూపించారు’’ అని ప్రశాంత్‌ అన్నారు.

ప్రస్తుతం ఉపేంద్ర దర్శకత్వంలో వస్తున్న మరో వైవిధ్యమైన చిత్రం ‘యూఐ’. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ మూవీ ఓ సరికొత్త కాన్సెప్ట్‌తో రూపొందుతున్నట్లు టాక్‌. ఇటీవల విడుదల చేసిన ఈ మూవీలోని ‘చీప్‌’ సాంగ్‌ లిరికల్‌ వైరల్ అయిన సంగతి తెలిసిందే. మార్చి 4న పూర్తి లిరికల్‌ పాటను విడుదల చేయనున్నారు. మరోవైపు ప్రశాంత్‌ నీల్‌ ‘సలార్‌-2: శౌర్యంగ పర్వం’ కోసం సిద్ధమవుతున్నారు. ప్రభాస్‌తో ఆయన తీసిన ‘సలార్‌’ ఘన విజయాన్ని అందుకోవడమే కాకుండా, బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఈ మూవీకి సీక్వెల్‌గా ‘సలార్‌2’ రాబోతోంది. ఇది పూర్తయిన తర్వాత ఎన్టీఆర్‌తో మరో సినిమా చేయనున్నారు. ‘కేజీయఫ్3’ కూడా పట్టాలెక్కే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని