Prem Rakshit: మరోసారి రాజమౌళితో ‘నాటు నాటు’ కొరియోగ్రాఫర్
‘నాటు నాటు’ (Naatu Naatu)తో రికార్డు సృష్టించారు కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్. తాజాగా ఆయన మరోసారి రాజమౌళితో కలిసి పనిచెయ్యనున్నట్లు తెలిపారు.
హైదరాబాద్: ఇటీవల ఆస్కార్ అందుకొని దుమ్మురేపింది ‘నాటు నాటు’ (Naatu Naatu) పాట. ఆ పాట ఆ స్థాయిలో విజయం సాధించడానికి కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ (Prem Rakshit) కూడా ఓ కారణం. తన అద్భుతమైన డ్యాన్స్‌కు ప్రపంచం మొత్తం కాలు కదిపింది. తాజాగా ఓ ప్రముఖ మీడియాతో ప్రేమ్ రక్షిత్ మాట్లాడారు. తన తర్వాత ప్రాజెక్ట్‌ల గురించి, ఆస్కార్ అనుభవం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
‘‘ప్రస్తుతం నా ఆనందాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. ఈ విజయంతో నేనే కాదు నా కుటుంబం కూడా చాలా ఆనందంగా ఉంది. ఆస్కార్ ఈవెంట్ కోసం మేము అమెరికా వెళ్లినప్పుడు చాలా ఎంజాయ్ చేశాం. వేదికపై ‘నాటు నాటు’ పాటకు విదేశీయులు డ్యాన్స్ చేస్తుంటే చాలా ఆనందం వేసింది. తాజాగా ప్రభుదేవా ఈ పాటకు తన బృందంతో కలిసి సెప్ట్స్ వేశారు. ఆ వీడియో చూసి చాలా ఆశ్చర్యపోయాను. ప్రభుదేవాని ‘గాడ్ ఆఫ్ డ్యాన్స్’ అంటారు. అలాంటి వ్యక్తి నన్ను మొచ్చుకొని నా పాటకు డ్యాన్స్ వెయ్యడం ఎప్పటికీ మర్చిపోలేను. అది నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తా’’ అని అన్నారు.
తన తదుపరి చిత్రాల గురించి మాట్లాడిన ప్రేమ్ రక్షిత్ ‘నాటు నాటు’ తర్వాత మరోసారి ఎన్టీఆర్ సినిమాకు పనిచేస్తున్నట్లు తెలిపారు. ‘‘ ఎన్టీఆర్ 30వ (NTR30) సినిమాకు నేను కొరియోగ్రాఫర్‌గా పని చేస్తున్నాను. త్వరలోనే రాజమౌళి (Rajamouli)తో కలిసి ఓ ప్రాజెక్ట్ చెయ్యనున్నా. దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. మరో రెండు నెలల్లో ఆయన్ని కలవాలి’’ అని చెప్పారు. ఇక ఈ విషయం తెలిసిన నెటిజన్లు మరోసారి సూపర్ హిట్ కాంబో రిపీట్ అవుతున్నందుకు ఖుషీ అవుతున్నారు. రాజమౌళి విజన్‌కు ప్రేమ్‌రక్షిత్ టాలెంట్ కలిస్తే అది ఒక సెన్సెషనే అంటున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Nayanthara: ఆనాడు దర్శకుడికి కోపం తెప్పించిన నయనతార.. ‘నువ్వు రావొద్దు’ అని చెప్పేసిన డైరెక్టర్
-
Crime News
Hyderabad: టీచర్, రాజేశ్ చనిపోవాలనుకున్నారు?.. పోలీసుల చేతికి కీలక ఆధారాలు
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
TSPSC: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మరో 13 మంది డిబార్
-
Crime News
Nellore: భర్త అంత్యక్రియలు ముగిసిన కొన్ని గంటలకే భార్య మృతి
-
Viral-videos News
Viral Video: ఇదేం వెర్రో..? రన్నింగ్ కారుపై పుష్ అప్స్ తీస్తూ యువకుడి హల్చల్!