War 2: వార్‌2లో కంపోజర్‌ ప్రీతమ్‌ భాగం కానున్నారా?

హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌ కలిసి నటిస్తోన్న చిత్రానికి ప్రీతమ్‌ సంగీతం అందించనున్నట్లు సమాచారం.

Published : 24 Mar 2024 14:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమల అగ్రకథానాయకులు ఎన్టీఆర్‌ (NTR), హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan) కలిసి నటిస్తోన్న చిత్రం ‘వార్‌2’(War 2). అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని యశ్‌రాజ్‌ స్పై యూనివర్స్‌ నిర్మిస్తోంది. ఇందులో ఎన్టీఆర్‌ రా ఏజెంట్‌గా కనిపించనున్నారు. త్వరలోనే చిత్రీకరణలో భాగం కానున్నారు. ఇటీవల జపాన్‌లో హృతిక్‌ పరిచయ సన్నివేశాలను చిత్రీకరించారు. ఇద్దరు స్టార్‌ హీరోలు నటిస్తున్న ఈ సినిమా అప్‌డేట్‌ కోసం సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా సినిమాకు సంబంధించిన ఓ వార్త తెరపైకి వచ్చింది. ఈ చిత్రానికి బాలీవుడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ప్రీతమ్‌ స్వరాలు అందించనున్నారని సమాచారం. 

ప్రస్తుతం ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రలో నటిస్తోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘దేవర’(Devara). కొరటాల శివ దీనిని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. జాన్వీ కపూర్‌ కథానాయిక. సైఫ్‌ అలీ ఖాన్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. తొలిభాగం ‘దేవర: పార్ట్‌1’ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా అక్టోబరు 10న విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని