Bade Miyan Chote Miyan: ఆ పాత్రకు ఓ ప్రత్యేకత ఉంది: పృథ్వీరాజ్‌ సుకుమారన్‌

అక్షయ్‌కుమార్‌, టైగర్‌ ష్రాఫ్‌లు నటించిన ‘బడేమియా ఛోటేమియా’ చిత్రంలో తన పాత్ర గురించి పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ మాట్లాడారు.

Published : 30 Mar 2024 14:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ కథానాయకులు అక్షయ్‌కుమార్‌, టైగర్‌ ష్రాఫ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బడేమియా ఛోటేమియా’. అలీ అబ్బాస్‌ జాఫర్‌ తెరకెక్కిస్తున్నారు. మానుషి చిల్లర్‌, అలయా ఎఫ్‌, సోనాక్షి సిన్హా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఈ సినిమా ఏప్రిల్‌ 10న విడుదల కానుంది. ఈ క్రమంలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ సినిమాలో తన పాత్ర గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘‘ ఈ సినిమాలో ‘కబీర్‌’ అనే ప్రతినాయకుడి పాత్రకు ఓ ప్రత్యేకత ఉంది. ఆ పాత్ర లేకుంటే సినిమా అసంపూర్తిగా ఉంటుంది. ఎవరు ఏ పాత్ర చేసినా సినిమా విజయం సాధించడమే ముఖ్యం. నేను ప్రధాన పాత్రలో నటించిన మలయాళ సినిమా ‘కురితి’ అందుకు ఉదాహరణ. అందులో నేను విలన్‌గా నటించాలి. కానీ కథ కోసం దర్శకుడు మను వారియర్‌ నన్ను హీరోని చేశారు. కథ నచ్చితే ఏ పాత్రలో అయినా నటిస్తాను. ‘బడేమియా ఛోటేమియా’లో నటీనటుల ఎంపిక కథను సమర్థించేలా జరిగిందని నమ్ముతున్నా. అక్షయ్‌కుమార్‌తో కలిసి పని చేయడం మంచి అనుభవం. సెట్‌లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. షూటింగ్‌ టైమ్‌లో మమ్మల్ని డిన్నర్‌కి తీసుకెళ్లినప్పుడు ఆయన తన కుమారుడితో ఏవిధంగా ఉంటారో ప్రత్యక్షంగా చూశాను. ఆయన ఓ మంచి త్రండి’’ అని పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ తెలిపారు.

పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ది గోట్‌ లైఫ్‌’(ఆడుజీవితం). ‘ది గోట్‌ డేస్‌’ నవల ఆధారంగా డైరెక్టర్‌ బ్లెస్సీ దీనిని తెరకెక్కించారు. అమలాపాల్‌ కథానాయిక. మార్చి 28న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణను అందుకుంటోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు