Priyamani: షారుక్‌తో సినిమా అంటే అన్నీ వదిలేస్తా: ప్రియమణి

షారుక్‌ఖాన్‌తో కలిసి పని చేసే అవకాశం రావాలేగానీ ఏదైనా వదిలేయడానికి సిద్ధమంటోంది సీనియర్‌ నటి ప్రియమణి.

Updated : 12 Apr 2024 12:26 IST

షారుక్‌ఖాన్‌తో కలిసి పని చేసే అవకాశం రావాలేగానీ ఏదైనా వదిలేయడానికి సిద్ధమంటోంది సీనియర్‌ నటి ప్రియమణి. గతంలో ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’లో.. ‘1 2 3 4 గెట్‌ ఆన్‌ ది డాన్స్‌ఫ్లోర్‌’ పాటలో షారుక్‌తో ఆడిపాడిన ప్రియమణి ‘జవాన్‌’ చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో నటించింది. ఇటీవలే ‘మైదాన్‌’తో అలరించిన ఈమె ఓ వేడుకలో మీడియాతో మాట్లాడుతూ.. షారుక్‌తో మళ్లీ కలిసి నటించాలనుందని మనసులో మాట బయట పెట్టింది. ‘ఒకవేళ షారుక్‌ నన్ను పిలిచి ‘రేపే వచ్చేయ్‌.. నాతో కలిసి పని చేయాలి’ అని చెబితే వెంటనే వెళ్లిపోతా. నా చేతిలో ఉన్న ప్రాజెక్టులన్నీ వదిలేస్తా. ఆయనతో కలిసి పని చేయడమే నాకు అన్నింటికన్నా ముఖ్యం’ అంటూ ఉత్సాహంగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె కీలక పాత్రలో తెరకెక్కుతున్న ‘ది ఫ్యామిలీమ్యాన్‌ 3’ వెబ్‌సిరీస్‌ చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని