Thangalaan: విక్రమ్‌ ‘తంగలాన్‌’.. ఆ పరిస్థితిని మారుస్తుంది: నిర్మాత ధనంజయన్‌

‘తంగలాన్‌’ రిలీజ్‌ డేట్‌పై నిర్మాత ధనంజయన్‌ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన పంచుకున్న విశేషాలివీ..

Published : 28 Feb 2024 17:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కోలీవుడ్‌లో ప్రస్తుతం గడ్డు పరిస్థితి నెలకొందని, ‘తంగలాన్‌’ (Thangalaan) సినిమా దాన్ని మారుస్తుందని నిర్మాత ధనంజయన్‌ (Dhananjayan) ఆశాభావం వ్యక్తం చేశారు. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఆ మూవీ రిలీజ్‌ డేట్‌పై స్పందిస్తూ.. ‘‘ఈ సినిమాతో హీరో విక్రమ్‌, డైరెక్టర్‌ పా.రంజిత్‌ ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగించనున్నారు. ఏప్రిల్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. లోక్‌సభ ఎన్నికలు పూర్తయిన వెంటనే రిలీజ్‌ చేయాలనుకుంటున్నాం. ఒకవేళ ఏప్రిల్‌ 16న ఎలక్షన్స్‌ జరిగితే ఏప్రిల్‌ 19న సినిమాని తీసుకొస్తాం. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారం మేం విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని అన్నారు.

విక్రమ్‌ (Vikram) హీరోగా పా.రంజిత్‌ (Pa. Ranjith) తెరకెక్కించిన ఈ సినిమాని ముందుగా జనవరి 26న విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించి తర్వాత వాయిదా వేశారు. కర్ణాటకలోని కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ కార్మికుల జీవితాల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. విక్రమ్‌ ప్రయోగాత్మక లుక్‌లో కనిపించనున్నారు. మాళవిక మోహనన్‌, పార్వతి తిరువోతు కీలక పాత్రలు పోషించారు. ‘‘నేను ఇప్పటివరకు ఏ సినిమా కోసం ఇంత కష్టపడలేదు. ‘తంగలాన్‌’ భిన్నమైన కథ. దీనిలో గ్లామర్‌ ఉండదు. ఈ సినిమా నా జీవితంలో మంచి అనుభవాన్నిచ్చింది. ‘తంగలాన్‌’ తెగ వారు ఎలా జీవిస్తారో.. మేం కూడా చిత్రీకరణలో అలాంటి పరిస్థితులను ఎదుర్కొంటూ షూటింగ్‌ చేశాం. ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు మరో ప్రపంచంలోకి వెళ్లినట్లు అనిపిస్తుంది’’ అని విక్రమ్‌ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని