Dil Raju: నాపై తప్పుడు వార్తలు రాస్తే తాటతీస్తా: సినీ నిర్మాత దిల్‌ రాజు

అసత్య వార్తలు రాసే న్యూస్‌ వెబ్‌సైట్లపై నిర్మాత దిల్‌రాజ్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Updated : 08 Jan 2024 18:03 IST

హైదరాబాద్‌: ప్రతి సంక్రాంతికి ఏదో రకంగా తనపై విమర్శలు చేస్తున్నారని, ఇకపై తన గురించి తప్పుడు వార్తలు రాసే వెబ్‌సైట్‌ల తాటతీస్తానని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు హెచ్చరించారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అసత్య వార్తలు రాస్తున్న వెబ్‌సైట్‌లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘ఇండస్ట్రీలో పక్కన ఉంటూనే మనపై రాళ్లు వేస్తారు. ప్రతి సంక్రాంతికి సినిమాలు విడుదలవుతుంటాయి. ఏదో రకంగా నాపై విమర్శలు చేస్తున్నారు. ‘హనుమాన్‌’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో చిరంజీవి మాట్లాడిన మాటలను కొన్ని వెబ్‌సైట్లు తప్పుగా వక్రీకరించాయి. నాపై తప్పుడు వార్తలు రాసే వెబ్‌సైట్ల తాటతీస్తా. వ్యాపారపరంగా వచ్చే విమర్శలను వాళ్లకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఈరోజు నుంచి ఊరుకునే ప్రసక్తే లేదు. తమిళ సినిమాను నేనే వాయిదా వేశా. హను-మాన్ సినిమా విడుదల చేయాలని నేనే చెప్పా. నైజాంలో ‘హనుమాన్’, ‘గుంటూరు కారం’ సినిమాలకు థియేటర్‌లు ఉన్నాయి. నాగార్జున, వెంకటేశ్ సినిమాలకు స్క్రీన్‌లు దొరకడం లేదు. తప్పుడు రాతలతో ఏం చేద్దామనుకుంటున్నారు. నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటాను. మీ వెబ్‌సైట్ల వ్యూస్‌ కోసం నా పేరు వాడితే ఊరుకునేది లేదు’’ అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు