Naga Vamsi: పెద్ద హీరోల సినిమాల్లో లాజిక్‌లు చూడొద్దు: నాగవంశీ

సినిమాను వినోదం కోసం మాత్రమే చూడాలని నిర్మాత నాగవంశీ అన్నారు. ‘గుంటూరు కారం’ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యాక దాన్ని చాలా మంది మెచ్చుకొన్నారని తెలిపారు.

Updated : 26 Mar 2024 13:52 IST

ఇంటర్నెట్ డెస్క్‌: పెద్ద హీరోల సినిమాలకు లాజిక్‌లతో పనిలేదన్నారు టాలీవుడ్‌ నిర్మాత నాగవంశీ (Nagavamsi). హీరోల ఎలివేషన్స్‌ చూసి ఎంజాయ్‌ చేయాలన్నారు. ఒక ఇంటర్వ్యూలోని ఆయన మాటలు ప్రస్తుతం ఎక్స్‌లో వైరల్‌గా మారాయి. సినిమాలపై ప్రతికూల కామెంట్స్‌ చేసేవారి గురించి ఆయన మాట్లాడారు.

‘‘సలార్‌’లో (Salaar) ప్రభాస్‌ను చూసి ఎంతోమంది అభిమానులు ఎంజాయ్‌ చేశారు. కానీ, కొందరు మాత్రం అందులోని సన్నివేశాల్లో లాజిక్‌ లేదని కామెంట్స్‌ చేశారు. ‘గుంటూరు కారం’లో కూడా హీరో తరచు హైదరాబాద్ వెళ్లినట్లు చూపించారు. వెంటనే ఎలా వెళ్తాడన్నారు. ఇలా మాట్లాడే వాళ్ల కోసం గుంటూరు నుంచి మొదలయ్యే మూడున్నర గంటల జర్నీని మూవీలో చూపించలేం కదా! ఈ చిత్రంపై రకరకాల కామెంట్స్‌ వచ్చాయి. మాస్‌ సీన్స్‌ లేవని, త్రివిక్రమ్ మార్క్‌ కనిపించలేదన్నారు. కానీ, నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైయ్యాక చాలా బాగుందని మెసేజ్‌లు పెట్టారు.

‘సరిలేరు నీకెవ్వరు’, ‘సర్కారు వారి పాట’లో మహేశ్ బాబు (Mahesh babu) మాస్‌ సాంగ్స్‌ చేశారు. వాటిని మించి ఉండాలని ‘గుంటూరు కారం’లో అలాంటి పాట పెట్టాం. దాన్ని చూసి ఎంజాయ్‌ చేయాలి. కానీ, ఆ టైమ్‌కు శ్రీలీల అక్కడకు రావడం, వెంటనే దుస్తులు మార్చుకోవడం లాంటి లాజిక్‌లు మాట్లాడకూడదు. సినిమాను వినోదం కోసమే తీస్తామని గమనించాలి. ఇండస్ట్రీలోనే గొప్ప రచయిత అని పేరున్న ఆయనకు సినిమా ఎలా తీయాలో నేర్పించాల్సిన అవసరం లేదు. చిత్రం బాగోలేదని కామెంట్‌ చేసే అర్హత ఎవరికైనా ఉంటుంది. కానీ, చిత్ర బృందం గురించి ప్రతిఒక్కరూ మాట్లాడకూడదు’ అని నాగవంశీ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని