Bharathanatyam: ఆ నేర ప్రపంచం నుంచి తనెలా బయటకొచ్చాడు!

‘‘వినోదంతో నిండిన క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమా ‘భరతనాట్యం’. ఇది తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా ఉంటుంది’’ అన్నారు నిర్మాత పాయల్‌ సరాఫ్‌. ఆమె నిర్మాణంలో సూర్య తేజ ఏలే, మీనాక్షి గోస్వామి జంటగా నటించిన ఈ చిత్రాన్ని కేవీఆర్‌ మహేంద్ర తెరకెక్కించారు.

Updated : 03 Apr 2024 14:09 IST

‘‘వినోదంతో నిండిన క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమా ‘భరతనాట్యం’. ఇది తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా ఉంటుంది’’ అన్నారు నిర్మాత పాయల్‌ సరాఫ్‌. ఆమె నిర్మాణంలో సూర్య తేజ ఏలే, మీనాక్షి గోస్వామి జంటగా నటించిన ఈ చిత్రాన్ని కేవీఆర్‌ మహేంద్ర తెరకెక్కించారు. ఈ సినిమా ఈనెల 5న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు పాయల్‌.

  • ‘‘యాక్షన్‌, ప్రేమకథలతో పోల్చితే క్రైమ్‌ థ్రిల్లర్‌ సేఫ్‌ జానర్‌. అందుకే నిర్మాతగా నా తొలి సినిమాని ఇదే జానర్‌లో చేయాలని నిర్ణయించుకున్నాం. దర్శకుడు కావాలని ప్రయత్నించే ఓ కుర్రాడి కథ ఇది. తను కుటుంబ పరంగా.. ప్రేమ పరంగా.. ఆర్థికంగా అనేక సమస్యలు ఎదుర్కొంటూ అనుకోకుండా క్రైమ్‌ వరల్డ్‌లోకి వచ్చి పడతాడు. మరి ఆ తర్వాత ఏమైంది? ఆ నేర ప్రపంచం నుంచి తనెలా బయట పడ్డాడన్నది ఈ చిత్ర ఇతివృతం. దీంట్లో కథ, పాత్రలు రొటీన్‌కు భిన్నంగా ఉంటాయి. నాయకానాయిలు కొత్త వాళ్లైనా మంచి అనుభవజ్ఞులైన నటీనటులున్నారు. వైవా హర్ష, హర్షవర్ధన్‌, అజయ్‌ ఘోష్‌ తదితరుల పాత్రలు గత చిత్రాలకు భిన్నంగా ఉంటాయి’’.
  • ‘‘నాకు చిన్నప్పటి నుంచి చిత్ర పరిశ్రమలో ఏదైనా చేయాలని ఆసక్తి ఉండేది. కానీ, నిర్మాతని అవుతానని అసలు అనుకోలేదు. మాకిది నిర్మాతగా తొలి చిత్రమవడం వల్ల ఆరంభంలో కొన్ని సవాళ్లు ఎదుర్కొన్నా. మా కథ బాగుంటుంది.. ఒక్క ఛాన్స్‌ ఇవ్వండని ఎవరినైనా అడగటానికి కూడా కష్టంగా అనిపించేది. నాకు నిర్మాతగా కొనసాగుతూనే అవకాశమొస్తే నటిగానూ చేయాలని ఉంది’’.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు