Puri Musings: వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్‌

 ‘పూరి మ్యూజింగ్స్‌’ పేరుతో పూరి జగన్నాథ్‌ మరో స్పెషల్‌ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్‌ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు.

Published : 19 Apr 2024 00:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పెన్సిల్వేనియాలో నివసించే అమిష్ పీపుల్‌ గురించి పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) వివరించారు. ‘పూరి మ్యూజింగ్స్‌’ (Puri Musings) పేరుతో ఆయన వివిధ అంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులోభాగంగా అమిష్‌ పీపుల్‌ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

‘‘అమిష్ పీపుల్‌ ఇప్పటికీ కరెంట్‌ వాడరు. ఇళ్లలో ఏసీ, ఫ్రిజ్‌, గ్రైండర్లు ఉండవు. స్మార్ట్‌ ఫోన్‌లు, టీవీల ఊసే ఉండదు. కార్లు అసలే వాడరు. 18వ శతాబ్దంలో ఎలా బతికేవారో ఇప్పటికీ అలానే ఉన్నారు. పిల్లలను ఎక్కువగా చదివించరు. ఉమ్మడి కుటుంబాలను ఇష్టపడతారు. ఆదివారమంతా విశ్రాంతి తీసుకుంటారు. ప్రపంచంలోని మిగతా జనాభాతో కలిసిపోయేందుకు ఆసక్తి చూపించరు. ఎవరికీ ఇంటర్వ్యూలు ఇవ్వరు. వాళ్ల జీవనశైలిని వీడియో తీయడానికి కూడా అంగీకరించరు. ఆడవాళ్లు మేకప్‌లు వేసుకోరు. పొగడ్తలను ఇష్టపడరు. అందరూ క్రమశిక్షణతో ఉంటారు. ఎవరికైనా ఆపద వస్తే అందరూ సాయం చేస్తారు. బంధాలకు విలువిస్తారు. ప్రకృతిని గౌరవిస్తారు. వాళ్ల మత గ్రంథంలో చెప్పినట్లే జీవిస్తారు. ప్రపంచమంతా మారుతున్నా.. వాళ్లు మాత్రం 300 ఏళ్ల క్రితం ఎలా ఉన్నారో అలానే ఉంటున్నారు’’.

‘‘అమిష్‌ పీపుల్ వాళ్లకంటూ ఒక ప్రపంచాన్ని సృష్టించుకున్నారు. ప్రకృతికి నష్టం వాటిల్లే పనులేవీ చేయరు. భార్యాభర్తలిద్దరూ ఒకే మంచం మీద పడుకుంటారు కానీ.. మధ్యలో చెక్క అడ్డం పెట్టుకుంటారు. నిద్రపోయే సమయంలో ఒకరిని ఒకరు తాకకూడదని ఇలా చేస్తారు. సోషల్‌మీడియా వాళ్లకు తెలియదు. అందుకే సంతోషంగా ఉన్నారు. ప్రతీ సాయంత్రం అందరూ కలిసి సరదాగా గడుపుతారు. త్వరగా నిద్రపోతారు. వాళ్లు చేస్తున్నది వందశాతం సరైనది.  వాళ్ల మీద హాలీవుడ్‌లో ఎన్నో సినిమాలు వచ్చాయి. వీలైతే ఒకసారి చూడండి’’ అని చెప్పారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని