Pushpa 2: ‘పుష్ప 2’.. ఆ ఒక్క సీన్‌ కోసం అన్ని కోట్లు ఖర్చు చేశారా!

అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘పుష్ప2’కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరలవుతోంది. సినిమా విషయంలో మేకర్స్‌ ఎక్కడా రాజీ పడడం లేదని తెలుస్తోంది.

Published : 11 Apr 2024 21:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ‘పుష్ప2’ కోసం ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్‌ (Allu arjun)- సుకుమార్‌ల హిట్‌ కాంబోలో తెరకెక్కుతోన్న ఈ సీక్వెల్‌కు సంబంధించిన ఏ వార్త అయినా క్షణాల్లో వైరలవుతోంది. తాజాగా దీని టీజర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. మిలియన్ల వ్యూస్‌తో రికార్డు సృష్టించిన బన్నీ ఇందులో మాతంగి వేషంలో విశేషంగా ఆకట్టుకున్నారు. టీజర్‌ విడుదలైన దగ్గర నుంచి సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.

అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్‌లో గంగమ్మ జాతర బ్యాక్‌డ్రాప్‌ను చూపించారు. అందులో పుష్పరాజ్‌ మేకప్‌, యాక్టింగ్‌ చూసి ప్రేక్షకులకు గూజ్‌బంప్స్‌ వచ్చాయి. ఈ ఒక్క సీన్‌ కోసం చిత్రబృందం ఏకంగా రూ.60 కోట్లు ఖర్చు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. సినిమాలో ఈ సన్నివేశం ఆరు నిమిషాలు ఉంటుందని టాక్‌. దీని చిత్రీకరణకు 30 రోజులు పట్టిందట. సినిమాకు ఇదే హైలైట్‌ అని.. దీని షూటింగ్‌ కోసం అల్లు అర్జున్ కూడా బాగా కష్టపడ్డారని సమాచారం. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈనేపథ్యంలోనే చిత్రబృందం ఫ్యాన్స్‌లో జోష్‌ పెంచేందుకు నటీనటుల పోస్టర్లను షేర్‌ చేస్తోంది.

‘పుష్ప: ది రైజ్‌’కి కొనసాగింపుగా తెరకెక్కుతున్నదే ‘పుష్ప: ది రూల్‌’ (పుష్ప 2). రష్మిక కథానాయిక. పార్ట్‌-1లో ప్రముఖ నటుడు ఫహాద్ ఫాజిల్‌ (Fahadh Faasil) ఎస్పీ భన్వ‌ర్‌సింగ్ షెకావ‌త్‌గా కనిపించి ఆకట్టుకున్నారు. రెండో భాగంలో భన్వర్‌ సింగ్‌ పాత్ర నిడివి ఎక్కువగా ఉండనుంది. హీరోకు, ఆ పాత్రకు మధ్య చాలా యాక్షన్‌ సన్నివేశాలు ఉండనున్నాయి.  శ్రీవల్లి.. పుష్పకు భార్యగా కనిపించనుంది. ఇటీవలే ఈ పాత్ర గురించి చెప్పిన రష్మిక మాట్లాడుతూ.. ఎన్నో బాధ్యతలు ఉంటాయన్నారు. ఈ సీక్వెల్‌ అందరూ ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని