Pushpa2: పుష్పరాజ్‌ మాస్‌ అప్‌డేట్..! జోష్‌లో ఫ్యాన్స్..

‘పుష్ప2’ నుంచి అప్‌డేట్‌ వచ్చేసింది. అది చూసి ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.

Published : 02 Apr 2024 16:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తోన్న అప్‌డేట్‌ వచ్చేసింది. అల్లు అర్జున్ (Allu arjun) హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘పుష్ప: ది రూల్‌’ (పుష్ప 2) చిత్రబృందం సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్‌ 8న టీజర్‌ విడుదల చేయనున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను పంచుకుంది. పుష్ప మాస్‌ జాతర కోసం వేచి ఉండండి అని మూవీ యూనిట్‌ తాజాగా పోస్ట్‌ పెట్టిన దగ్గరి నుంచి ఫ్యాన్స్‌ అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. ఇప్పుడీ అప్‌డేట్‌ వారిలో జోష్ నింపింది.

2021లో విడుదలై సూపర్‌హిట్‌ అందుకున్న ‘పుష్ప: ది రైజ్‌’కి కొనసాగింపుగా తెరకెక్కుతున్నదే ‘పుష్ప: ది రూల్‌’ (పుష్ప 2). రష్మిక కథానాయిక. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన దీని గ్లింప్స్‌, పోస్టర్లు భారీ అంచనాలు కలిగించాయి. అల్లు అర్జున్ గంగమ్మ తల్లి గెటప్‌ సోషల్ మీడియాను ఊపేసింది. అలాగే చిత్రబృందం కూడా పలు ఇంటర్వ్యూల్లో ఈ చిత్రం షూటింగ్ అప్‌డేట్స్‌ పంచుకుంటూ అంచనాలను రెట్టింపు చేసింది. ఇటీవల రష్మిక ఈ సీక్వెల్ గురించి మాట్లాడుతూ.. ‘నేను రెండో పార్ట్‌లో పుష్పకు భార్యగా కనిపిస్తాను. ఎన్నో బాధ్యతలు ఉంటాయి. ఈ సీక్వెల్‌ మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటుంది. సుకుమార్‌ ప్రతీ సన్నివేశాన్ని పర్‌ఫెక్ట్‌గా తీస్తారు. మొదటి భాగానికి భారీ స్థాయిలో స్పందన రావడంతో రెండో పార్ట్‌పై అధిక అంచనాలు నెలకొన్నాయి’ అని చెప్పారు. దీంతో ఈ చిత్రంపై ఆసక్తి ఎక్కువైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని