Pushpa 2: మాస్‌ జాతర

‘పుష్ప2’ ప్రచార హంగామాకి తెర లేచింది. కథానాయకుడు అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 8న టీజర్‌ని విడుదల చేస్తున్నారు. పుష్ప మాస్‌ జాతర మొదలవుతోందంటూ టీజర్‌ విడుదల తేదీని మంగళవారం సినీ వర్గాలు ప్రకటించాయి.

Updated : 03 Apr 2024 14:06 IST

‘పుష్ప2’ ప్రచార హంగామాకి తెర లేచింది. కథానాయకుడు అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 8న టీజర్‌ని విడుదల చేస్తున్నారు. పుష్ప మాస్‌ జాతర మొదలవుతోందంటూ టీజర్‌ విడుదల తేదీని మంగళవారం సినీ వర్గాలు ప్రకటించాయి. విజయవంతమైన ‘పుష్ప’కి కొనసాగింపుగా రూపొందుతున్న చిత్రమే ‘పుష్ప2’. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక కథానాయిక. ఫహాద్‌ ఫాజిల్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. సుకుమార్‌ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్‌కి ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం తెచ్చిపెట్టిన చిత్రం ‘పుష్ప’. కొనసాగింపుగా వస్తున్న ‘పుష్ప2’పై భారీ అంచనాలు ఉన్నాయి.  అందుకు తగ్గట్టుగానే భారీ హంగులతో చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ధనుంజయ్‌, సునీల్‌, అనసూయ భరద్వాజ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైన్‌: రామకృష్ణ,  మోనిక నిగొత్రే, పాటలు: చంద్రబోస్‌, ఛాయాగ్రహణం: మిరోస్లా క్యూబా బ్రోజెక్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని