R Madhavan: ఇప్పటివరకు ఇలాంటి కోస్టార్‌ను చూడలేదు: మాధవన్‌

అజయ్‌దేవ్‌గణ్‌తో కలిసి పనిచేయడంపై మాధవన్‌ స్పందించారు. తన జీవితంలో ఆయనలాంటి కోస్టార్‌ను చూడలేదన్నారు.

Published : 24 Apr 2024 18:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎలాంటి పాత్రలోనైనా తనదైనశైలిలో నటించి మెప్పించగలరు హీరో మాధవన్‌ (R Madhavan). ఇటీవల విడుదలైన ‘షైతాన్‌’(Shaitan)లో విలన్‌గా కనిపించి ఆకట్టుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాధవన్‌ మాట్లాడుతూ.. అజయ్‌ దేవ్‌గణ్‌తో (Ajay Devgn) కలిసి పనిచేసిన అనుభవాన్ని పంచుకున్నారు.

‘నా జీవితంలో అజయ్‌దేవగణ్‌ లాంటి కోస్టార్‌ను చూడలేదు. అలాంటి వ్యక్తితో కలిసి ఇప్పటివరకు పని చేయలేదు. ఆయన పనిని ప్రేమిస్తారు. ‘షైతాన్‌’లో ఆయనతో పనిచేయడం వల్ల చాలా నేర్చుకున్నాను. ఈ చిత్రానికి ఆయన నిర్మాతగానూ వ్యవహరించారు. అయినా సెట్‌లో చాలా సరదాగా ఉండేవారు. చిత్రీకరణ దగ్గర నుంచి ఎడిటింగ్ వరకు అన్నీ దగ్గరుండి చూసుకునేవారు. ‘షైతాన్‌’ టైటిల్‌ కూడా ఆయన ఎంపిక చేసినదే. ఇందులో పాత్ర కోసం  ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నా. స్క్రీన్‌పై నేను బాగా కనిపించాలని నాకంటే ఎక్కువ అజయ్‌ తాపత్రయపడ్డాడు. షూటింగ్‌ జరుగుతున్నన్ని రోజులు జాగ్రత్తగా చూసుకున్నాడు. అతడి కేరింగ్‌ చూసి నా భార్య కూడా ఆశ్చర్యపోయింది. ‘మీ నాన్న కూడా మిమ్మల్ని ఇంత జాగ్రత్తగా చూసుకోలేదు’ అని నాతో చెప్పింది’ అంటూ అజయ్‌పై ప్రశంసలు కురిపించారు. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘షైతాన్‌’ మార్చిలో ప్రేక్షకుల ముందుకువచ్చింది. బాక్సాఫీస్‌ వద్ద రూ. 150కోట్లు వసూళ్లు చేసింది.

ప్రస్తుతం మాధవన్‌ నాలుగు ప్రాజెక్ట్‌లతో అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. వీటిలో రెండు సినిమాలు ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకొని పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ఉండగా మరో రెండు సెట్స్‌పై ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని