Raghava Lawrence: చిరంజీవితో సినిమా.. లారెన్స్‌ మాస్టర్‌ ఏమన్నారంటే?

‘చిరంజీవితో సినిమా తీస్తారా?’ అనే ప్రశ్నపై దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్‌ స్పందించారు. ఆయన సమాధానమేంటంటే?

Published : 08 Nov 2023 20:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్యాక్‌గ్రౌండ్‌ డ్యాన్సర్‌గా కెరీర్‌ని ప్రారంభించి కొరియోగ్రాఫర్‌గా, నటుడిగా, దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా ఎదిగి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు రాఘవ లారెన్స్‌ (Raghava Lawrence). నటుడిగా డబ్బింగ్‌ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరిస్తున్నా.. ఆయన నేరుగా తెలుగు సినిమా తెరకెక్కించి దాదాపు పదేళ్లు అవుతోంది. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తెలుగులో సినిమా చేయడంపై ఆయన స్పందించారు. ‘ఎప్పుడు తెలుగు సినిమా తీస్తారు? చిరంజీవితో సినిమా ఉంటుందా?’ అనే ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘నేరుగా తెలుగు చిత్రం తీయాలని నాకూ ఉంది. తమిళంలో తెరకెక్కించిన సినిమాలు ఇక్కడ కూడా విడుదలవుతున్నాయని కదా అని ఇంతకాలం అనుకున్నా. కానీ, ‘జిగర్‌ తండ డబుల్‌ ఎక్స్‌’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తెలుగు అభిమానుల ప్రేమ చూసి నేరుగా తెలుగు సినిమా తీయాలనిపించింది.  త్వరలోనే చేస్తా.  చిరంజీవి సర్‌ విషయానికొస్తే.. అన్నింటి కంటే ముఖ్యంగా ఆయనకు కథ నచ్చాలి. ఒకవేళ నేను చెప్పే స్టోరీ ఆయనకు నచ్చితే తప్పకుండా సినిమా తీస్తా’’ అని తెలిపారు.

రష్మిక మార్ఫింగ్‌ వీడియో అంశంపై స్పందించిన విజయ్‌ దేవరకొండ..

ఎన్నో సూపర్‌హిట్‌ పాటలకు నృత్య రీతులు సమకూర్చిన లారెన్స్‌ తెలుగు సినిమా ‘మాస్‌’తో దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. అందులో నాగార్జున హీరోగా నటించారు. తదుపరి ‘డాన్’ (నాగార్జున), ‘రెబల్‌’ (ప్రభాస్‌), ‘స్టైల్‌’ చిత్రాలను డైరెక్ట్‌ చేశారు. తమిళంలో ‘కాంచన’, ‘కాంచన 2’, ‘కాంచన 3’, హిందీలో ‘లక్ష్మి’ తెరకెక్కించారు. కొన్ని రోజుల క్రితమే హీరోగా ‘చంద్రముఖి 2’తో సందడి చేసిన లారెన్స్‌ ఇప్పుడు ‘జిగర్‌ తండ డబుల్‌ ఎక్స్‌’ (Jigarthanda DoubleX)తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కార్తీక్‌ సుబ్బరాజు తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే లారెన్స్‌ వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు