Raghava Lawrence: ‘కాంచన 4’ రూమర్స్‌.. స్పందించిన రాఘవ లారెన్స్‌

‘కాంచన 4’ సినిమా విషయంలో వచ్చిన రూమర్స్‌పై రాఘవ లారెన్స్‌ స్పందించారు.

Published : 09 Jun 2024 16:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తాను త్వరలో తెరకెక్కించనున్న ‘కాంచన 4’ (Kanchana 4)పై వచ్చిన రూమర్స్‌పై నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్‌ (Raghava Lawrence) స్పందించారు. వాటిలో నిజం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. ‘‘కాంచన 4’ నటుల ఎంపిక గురించి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నవి రూమర్స్‌ మాత్రమే. నటీనటులకు సంబంధించి రాఘవ ప్రొడక్షన్స్‌ నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటన త్వరలోనే వస్తుంది’’ అని తెలిపారు. ఈ సినిమాలో మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) హీరోయిన్‌గా నటించనున్నారంటూ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

‘అవును’లో విజయ్‌ దేవరకొండను అనుకున్నా కానీ..: రవిబాబు

హారర్‌ కామెడీ నేపథ్యంలో రూపొందిన ‘కాంచన’ సిరీస్‌ చిత్రాలు మంచి ఆదరణ పొందాయి. ఈ ఫ్రాంచైజీలో ఇప్పటి వరకు మూడు సినిమాలొచ్చాయి. మూడు భాగాలకు లారెన్స్‌ దర్శకత్వం వహిస్తూ.. ప్రధాన పాత్రలో నటించారు. ‘కాంచన 4’ చిత్రీకరణను సెప్టెంబరులో ప్రారంభించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని