Rajamouli: ప్రభుదేవా పాటకు రాజమౌళి దంపతుల డ్యాన్స్‌.. రిహార్సల్స్‌ వీడియో వైరల్‌

ప్రముఖ దర్శకుడు రాజమౌళి (Rajamouli) ఇటీవల ఓ వివాహ వేడుకలో పాల్గొన్నారు. తన డ్యాన్స్‌తో అక్కడి అతిథులను అలరించారు.

Updated : 11 Apr 2024 11:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి చేర్చిన దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli). వర్క్‌, ఫ్యామిలీ టైమ్‌ను చక్కగా బ్యాలెన్స్‌ చేస్తుంటారాయన. షూటింగ్స్‌ నుంచి కాస్త విరామం దొరికినా.. కుటుంబసభ్యులతో గడుపుతారు. ఈ క్రమంలోనే ఇటీవల ఓ వివాహ వేడుకలో పాల్గొని తన సతీమణి రమతో డ్యాన్స్‌ చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన రిహార్సల్స్‌ వీడియో తాజాగా బయటకు వచ్చింది. 

మైత్రి మూవీ మేకర్స్‌ సీఈవో, నిర్మాత చెర్రీ కుమార్తె వివాహం ఇటీవల ఘనంగా జరిగింది. ఈ వేడుకలో పాల్గొన్న రాజమౌళి తన సతీమణి రమతో డ్యాన్స్‌ చేసినట్లు పలు కథనాలు వెలువడ్డాయి. ప్రభుదేవా ఆల్‌టైమ్‌ హిట్స్‌లో ఒకటైన ‘అందమైన ప్రేమరాణి’ పాటకు వీరిద్దరూ స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన రిహార్సల్స్‌ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. రాజమౌళి-రమ డ్యాన్స్‌ ప్రాక్టీస్ చేస్తున్న క్లిప్‌ను చూసిన నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

సినిమాల విషయానికి వస్తే.. రాజమౌళి ప్రస్తుతం మహేశ్‌ బాబుతో చేయనున్న ప్రాజెక్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. యాక్షన్‌ అడ్వెంచర్‌గా సిద్ధం కానుంది. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో పలువురు హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌ కూడా పనిచేయనున్నారు. ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్‌ ఇస్లాన్‌ హీరోయిన్‌గా నటించే అవకాశం ఉందని సమాచారం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని