Salaar: రాజమౌళి చేతికి ‘సలార్‌’ తొలి టికెట్‌

‘సలార్‌’ విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రచార పర్వాన్ని వేగవంతం చేస్తోంది చిత్ర బృందం. దీనిలో భాగంగానే తాజాగా ఈ చిత్ర ఫస్ట్‌ టికెట్‌ను దర్శకుడు రాజమౌళి కొనుగోలు చేశారు.

Updated : 17 Dec 2023 10:59 IST

‘సలార్‌’ విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రచార పర్వాన్ని వేగవంతం చేస్తోంది చిత్ర బృందం. దీనిలో భాగంగానే తాజాగా ఈ చిత్ర ఫస్ట్‌ టికెట్‌ను దర్శకుడు రాజమౌళి కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోని చిత్ర బృందం సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. అందులో రాజమౌళితో పాటు ప్రభాస్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, ప్రశాంత్‌ నీల్‌, నవీన్‌ యెర్నేని, విజయ్‌ కిరగందూర్‌ కనిపించారు. ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన ఈ యాక్షన్‌ డ్రామా చిత్రంలో ప్రభాస్‌ కథానాయకుడిగా కనిపించనుండగా.. ఆయనకు జోడీగా శ్రుతిహాసన్‌ నటించింది. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, జగపతిబాబు తదితరులు కీలక పాత్ర పోషించారు. ఈ చిత్ర తొలి భాగం ‘సలార్‌ పార్ట్‌ 1: సీజ్‌ ఫైర్‌’ పేరుతో ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు