Rajamouli: వాళ్లను అభినందించకుండా ఉండలేకపోతున్నా: రాజమౌళి

‘ఆర్‌ఆర్‌ఆర్‌’పై జపాన్‌ ప్రేక్షకులు చూపిస్తోన్న ప్రేమ ఆశ్చర్యపరుస్తోందని రాజమౌళి అన్నారు.  

Published : 22 Mar 2024 19:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన విజువల్‌ వండర్‌ ‘ఆర్ఆర్‌ఆర్‌’ మరో అరుదైన ఘనత సాధించింది. ఆస్కార్‌తో సహా ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న ఈ చిత్రాన్ని జపాన్‌లో 110 ఏళ్ల నాటి మ్యూజికల్‌ థియేటర్‌లో ప్రదర్శించారు. ఈవిషయంపై ఆనందం వ్యక్తం చేస్తూ రాజమౌళి పోస్ట్‌ పెట్టారు.

‘‘ఆర్ఆర్ఆర్‌’ను 110 ఏళ్ల నాటి తకరాజుకా సంస్థ నిర్వహించే మ్యూజికల్‌ థియేటర్‌లో ప్రదర్శించారు. ఈ చిత్రాన్ని ఎంత ఆదరించారో ఈ మ్యూజికల్‌ షోపై కూడా జపాన్‌ ప్రేక్షకులు అంతే ప్రేమ చూపారు. జపనీస్‌ ఆడియన్స్‌కు ధన్యవాదాలు. మీ స్పందన చూసి మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఈ షోలో మీ శక్తి, ప్రతిభ ఆశ్చర్యపరిచాయి. ఈ కార్యక్రమంలో భాగమైన అమ్మాయిలను అభినందించకుండా ఉండలేకపోతున్నా’ అని రాసుకొచ్చారు. దీనిపై నెటిజన్లు కూడా ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

ప్రస్తుతం రాజమౌళి #SSMB29తో బిజీగా ఉన్నారు. మహేశ్‌బాబు హీరోగా ఈ చిత్రం రూపొందుతోంది. యాక్షన్‌ అడ్వెంచర్‌ నేపథ్యంలో రానున్న ఈ సినిమాకు మహారాజ్‌ (Maharaj) అని పేరు పెట్టాలనే ఆలోచనలో ఉన్నారంటూ చిత్ర పరిశ్రమలో చర్చ జరుగుతోంది. ఇందులో ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్‌ ఇస్లాన్‌ హీరోయిన్‌గా, హాలీవుడ్‌ ప్రముఖ నటుడు క్రిస్‌ హెమ్స్‌వర్త్‌ కీలకపాత్ర పోషించనున్నారని కూడా టాక్‌ వినిపిస్తోంది. మహేశ్‌బాబు కూడా ఈ సినిమా కోసం సిద్ధమవుతున్నారు. తన లుక్‌ను కూడా మార్చుకున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని