Prabhas: రంగంలోకి రాజాసాబ్‌

‘రాజాసాబ్‌’ కోసం మళ్లీ రంగంలోకి దిగుతున్నారు కథానాయకుడు ప్రభాస్‌. మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది.

Updated : 17 Apr 2024 11:57 IST

‘రాజాసాబ్‌’ కోసం మళ్లీ రంగంలోకి దిగుతున్నారు కథానాయకుడు ప్రభాస్‌. మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. నిధి అగర్వాల్‌, మాళవిక మోహనన్‌, రిద్ది కుమార్‌ కథానాయికలు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా ఇటీవల హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ని ప్రారంభించుకోగా.. తాజాగా నిధి అగర్వాల్‌ సెట్లోకి అడుగు పెట్టింది. ఈ వారంలోనే ప్రభాస్‌ కూడా సెట్లోకి రానున్నారని సమాచారం. ఈ షెడ్యూల్‌లో భాగంగా వీళ్లిద్దరిపై కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటను చిత్రీకరించనున్నట్లు తెలిసింది. హారర్‌ కామెడీ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజువల్‌ ఎఫెక్ట్స్‌కు ఎంతో ప్రాధాన్యముందట. దీన్ని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు