Nagarjuna: రజనీ చిత్రంలో నాగ్‌?

లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రజనీ 171వ సినిమా ఇది. సోమవారం పేరుని ప్రకటిస్తున్నారు.

Updated : 22 Apr 2024 12:17 IST

లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రజనీ 171వ సినిమా ఇది. సోమవారం పేరుని ప్రకటిస్తున్నారు. ‘తంగమ్‌’, ‘రాణా’ తదితర పేర్లు ప్రచారంలో ఉన్నాయి. మరోవైపు ఇందులో నటిస్తున్న తారల గురించీ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఇదొక మల్టీస్టారర్‌ సినిమా తరహాలో తెరకెక్కబోతోందని, ఇందులో తెలుగు కథానాయకుడు నాగార్జున ఓ కీలక పాత్రని పోషిస్తున్నారని తమిళ సినీవర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఇటీవలే లోకేశ్‌ కనగరాజ్‌ హైదరాబాద్‌కి వచ్చి నాగార్జునతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే ఇందులో రజనీకాంత్‌కి కూతురు పాత్ర కోసం శ్రుతిహాసన్‌ ఎంపికైనట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయాలపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. నాగార్జున ఇప్పటికే ధనుష్‌తో కలిసి, శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’ చిత్రంలో నటిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని