Rajkummar Rao: ‘శ్రీకాంత్‌’ చిత్రం... మీ కళ్లు తెరిపించే ప్రయాణం

ప్రముఖ పారిశ్రామికవేత్త, బొల్లాంట్‌ ఇండస్ట్రీస్‌ వ్యవస్థాపకుడు శ్రీకాంత్‌ బొల్లా జీవితం ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. దృష్టి లోపం ఉన్నా నిర్భయంగా తన కలల్ని సాకారం చేసుకున్నారు శ్రీకాంత్‌.

Updated : 31 Mar 2024 13:44 IST

ప్రముఖ పారిశ్రామికవేత్త, బొల్లాంట్‌ ఇండస్ట్రీస్‌ వ్యవస్థాపకుడు శ్రీకాంత్‌ బొల్లా జీవితం ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. దృష్టి లోపం ఉన్నా నిర్భయంగా తన కలల్ని సాకారం చేసుకున్నారు శ్రీకాంత్‌. తుషార్‌ హీరానందానీ తెరకెక్కిస్తున్న ఈ బయోపిక్‌లో రాజ్‌కుమార్‌ రావ్‌ టైటిల్‌ పాత్ర పోషిస్తున్నారు. అలయా ఎఫ్‌, జ్యోతిక కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మొదట్లో ఈ చిత్రానికి ‘శ్రీ’ అనే పేరు పెట్టారు. తాజాగా సినిమా పేరుని ‘శ్రీకాంత్‌’గా మార్చారు. దీంతో పాటు మే 10న ఈ సినిమా విడుదల కానున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని అలయా సామాజిక మాధ్యమాల వేదికగా తెలుపుతూ అందుకు సంబంధించిన ఫొటోను పంచుకుంది. ‘‘శ్రీకాంత్‌’ మీ కళ్లు తెరిపించే ఓ అద్భుతమైన ప్రయాణం’ అంటూ రాసుకొచ్చింది. భూషణ్‌ కుమార్‌, కృష్ణన్‌ కుమార్‌, నిధి పర్మార్‌ హీరానందానీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని