Rakul Preet Singh: జాకీలో ఆ విషయం నన్ను ఆకర్షించింది: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

తన భర్త జాకీ భగ్నానీపై పొగడ్తల వర్షం కురిపించారు నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh). అతడు ఎంతో మంచివాడన్నారు.

Published : 08 Mar 2024 15:26 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వివాహమైన తర్వాత తొలిసారి తన భర్త జాకీ భగ్నానీ (Jackky Bhagnani) గురించి మాట్లాడారు నటి రకుల్‌ ప్రీత్ సింగ్‌ (Rakul Preet Singh). అస్సాం వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న జాకీ తనకు సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌ చాలా ఎక్కువని చెప్పగా, పక్కనే ఉన్న రకుల్‌ అది నిజమేనన్నారు. ఆయన్ని పొగడ్తలతో ముంచెత్తారు. ‘‘జాకీ మంచి మనసు, హాస్య చతురత కలిగిన వ్యక్తి. అతడిలోని కామెడీ టైమింగే తొలుత నన్ను ఆకర్షించింది. తను ఎప్పుడూ సరదాగా ఉంటాడు. చుట్టూ ఉన్నవాళ్లు సంతోషంగా ఉండేలా చూస్తాడు’’ అని ఆమె అన్నారు.

కన్నడ చిత్రం ‘గిల్లీ’తో తెరంగేట్రం చేసిన రకుల్‌ హిందీ పరిశ్రమలో ఇటీవల దశాబ్దకాలం పూర్తి చేసుకున్నారు. బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సమయంలో కామన్‌ ఫ్రెండ్స్‌ వల్ల బాలీవుడ్‌ నిర్మాత జాకీ భగ్నానీతో ఆమెకు పరిచయం ఏర్పడింది. గత మూడేళ్ల నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో ఫిబ్రవరి 21న వీరి పెళ్లి జరిగింది. గోవాలోని ఓ ప్రముఖ రిసార్ట్స్‌లో జరిగిన వివాహ వేడుకల్లో కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. వివాహం అనంతరం ఇటీవల అస్సాం టూర్‌కు వెళ్లారు. అక్కడి ప్రముఖ దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అస్సాం స్టేట్‌ ఫిల్మ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని