Rakul Preet: ఘనంగా సినీనటి రకుల్‌ ప్రీత్‌ వివాహం

సినీ నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌(Rakul Preet Singh) వివాహం గోవాలో ఘనంగా జరిగింది. 

Published : 21 Feb 2024 21:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినీనటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌(Rakul Preet Singh) వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. సినీ నిర్మాత జాకీ భగ్నానీతో గోవాలోని ఓ రిసార్ట్స్‌లో వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. రకుల్‌-భగ్నానీ జంట గత మూడేళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. కొత్త జంటకు పలువురు సెలబ్రిటీలు, అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కన్నడ చిత్రం ‘గిల్లీ’తో తెరంగేట్రం చేసిన రకుల్‌ ఇటీవల హిందీ పరిశ్రమలో దశాబ్దకాలం పూర్తి చేసుకున్నారు. బాలీవుడ్‌లో ఒకే ఏడాది ఐదు చిత్రాల్లో నటించి మెప్పించారు. ‘ఎటాక్‌’, ‘రన్‌వే 34’, ‘కట్‌పుట్లీ’, ‘డాక్టర్‌ జీ’, ‘థాంక్‌ గాడ్‌’ చిత్రాలు 2022లో విడుదలయ్యాయి. దక్షిణాదిలోను తనదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’తో తొలి విజయాన్ని అందుకున్న రకుల్‌.. ‘ధృవ’, సరైనోడు’, ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’, ‘నాన్నకు ప్రేమతో’, మన్మథుడు-2’ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని