Rakul Preet: నిజ జీవితానికి దగ్గరయ్యేలా...

త్వరలో ‘భారతీయుడు 2’తో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది నాయికా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. అగ్రకథానాయకుడు కమల్‌ హాసన్‌ ప్రధాన పాత్రలో శంకర్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది.

Published : 10 Jun 2024 01:56 IST

త్వరలో ‘భారతీయుడు 2’తో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది నాయికా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. అగ్రకథానాయకుడు కమల్‌ హాసన్‌ ప్రధాన పాత్రలో శంకర్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు సినీప్రియుల దృష్టిని ఆకర్షించాయి. ఇందులో కాజల్, సిద్ధార్థ్‌లతో పాటు ఓ కీలక పాత్రలో మెరవనుంది రకుల్‌. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. ఈ సినిమాలోని తన పాత్ర గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. ‘‘ఇది కచ్చితంగా నా కెరీర్‌లోనే ప్రత్యేకమైన చిత్రాల్లో ఒకటిగా ఉండిపోతుంది. ఇందులో నేను పోషించిన పాత్ర కూడా మునుపటి కంటే భిన్నంగా ఉండనుంది. ఈ చిత్రంలో నేను ఆత్మవిశ్వాసం కలిగిన అమ్మాయిగా కనిపించనున్నాను. అనుకున్న దాన్ని ఎలా సాధించాలో ఆమెకు బాగా తెలుసు. ఈ ప్రాజెక్టుతో ప్రయాణం చేస్తున్నన్ని రోజులు..ఈ పాత్ర నా నిజజీవితానికి దగ్గరగా ఉందనే భావన కలిగింది. మరిన్ని విషయాలు వెల్లడించడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాను. కానీ ఇప్పుడు చెప్పలేను. శంకర్‌ సర్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంద’’ని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ‘దే దే ప్యార్‌ దే2’ చిత్రీకరణలో ఉంది రకుల్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు