Rakul Preet: రకుల్‌ పెళ్లి సందడి మొదలైంది.. ప్రీ వెడ్డింగ్ వేడుకలో వధూవరులు

తెలుగు, తమిళ భాషల్లో మంచి గుర్తింపుతెచ్చుకున్న నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్ (Rakul Preet Singh). ఫిబ్రవరి 21న ఆమె, నిర్మాత జాకీ భగ్నానీని గోవాలో వివాహం చేసుకోన్నారు.

Updated : 17 Feb 2024 12:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగు, తమిళ భాషల్లో మంచి గుర్తింపుతెచ్చుకున్న నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్ (Rakul Preet Singh). ఫిబ్రవరి 21న ఆమె, నిర్మాత జాకీ భగ్నానీని గోవాలో వివాహం చేసుకోన్నారు. తాజాగా ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు మొదలుపెట్టారు. వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. రకుల్‌, జాకీ భగ్నానీ ఇన్‌స్టాగ్రామ్‌లో ‘అన్ని మంచి విషయాలు జరగనున్నాయి’ అని పోస్ట్‌ పెట్టారు. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. 

‘గిల్లీ’ అనే కన్నడ చిత్రంలో తెరంగేట్రం చేసిన రకుల్‌ ఇటీవల హిందీ పరిశ్రమలో దశాబ్దకాలం పూర్తి చేసుకున్నారు. ఇందులో భాగంగానే బాలీవుడ్‌లో ఒకే ఏడాదిలో ఆమె ఐదు చిత్రాల్లో నటించి మెప్పించారు. ‘ఎటాక్‌’, ‘రన్‌వే 34’, ‘కట్‌పుట్లీ’, ‘డాక్టర్‌ జీ’, ‘థాంక్‌ గాడ్‌’ చిత్రాలు 2022లో విడుదలయ్యాయి. దక్షిణాదిలోను తనదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’తో తొలి విజయాన్ని అందుకున్నారు. అనంతరం ‘ధృవ’, సరైనోడు’, ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’, ‘నాన్నకు ప్రేమతో’, మన్మథుడు-2’ వంటి హిట్‌ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.  ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేస్తూ ఇటీవల పోస్ట్‌ పెట్టారు. ‘‘అందమైన కలలతో పదేళ్ల క్రితం బాలీవుడ్‌లో తొలి అడుగు వేశాను. ఎన్నో ఆటుపోట్లను అధిగమించి  ఈ స్థాయిలో ఉన్నా. కలల సాకారంలో నాకు అండగా ఉన్నవారికి ధన్యవాదాలు’’అని రకుల్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని