Rakul Preet Singh: ఎన్నో ఏళ్లు ఒంటరిగా గడిపాను.. పెళ్లి వార్తలపై రకుల్‌ స్పందన

తన పెళ్లి గురించి వస్తోన్న వార్తలపై నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్పందించారు.

Updated : 16 Jan 2024 12:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh), బాలీవుడ్‌ నిర్మాత జాకీ భగ్నానీ (Jackky Bhagnani) ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వీళ్లిద్దరూ ఈ ఫిబ్రవరిలో పెళ్లి పీటలెక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా వీటిపై రకుల్‌ స్పందించారు.

‘ప్రతి ఒక్కరూ భాగస్వామిని కలిగి ఉండడం సహజమైన ప్రక్రియ. సినీ పరిశ్రమలో ఉన్న వారిపై ఈ విషయంలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తుంటాయి. నేను ఎన్నో సంవత్సరాలు ఒంటరిగా జీవించాను. జాకీ నా జీవితంలోకి వచ్చాక అంతా మారిపోయింది. అతడు ఇదే పరిశ్రమకు చెందిన వ్యక్తి కావడంతో నన్ను పూర్తిగా అర్థం చేసుకున్నాడు. మేమిద్దరం సినిమా, ఫిట్‌నెస్‌ను ఇష్టపడతాం. రోజుకు 12 గంటలు షూటింగ్‌లో బిజీగా ఉంటాం. గంట మాత్రమే కలిసి సమయాన్ని గడుపుతాం. ఆ సమయంలో వ్యక్తిగత విషయాలు మాత్రమే మాట్లాడుకుంటాం’’ అని చెప్పారు.

తన కెరీర్‌ గురించి మాట్లాడుతూ..‘‘పదేళ్ల క్రితం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. సినీ నేపథ్యం లేకపోవడం వల్ల మొదట్లో ఎలాంటి కథలు ఎంచుకోవాలో తెలియలేదు. నా తొలి సినిమాతోనే ఆదరణ లభించడం అదృష్టం. సినీ కెరీర్‌ నాకెంతో సంతృప్తినిచ్చింది. ఎక్కువగా కుటుంబంతో కలిసి చూసే సినిమాల్లోనే నటించాను. మంచి స్క్రిప్ట్‌ అయితే ఎక్కువ గంటలు కూడా పనిచేశాను. పారితోషికం గురించి ఆలోచించలేదు’’ అన్నారు.

‘గిల్లి’ కన్నడ సినిమాతో రకుల్‌ నటిగా ఎంట్రీ ఇచ్చారు. 2013లో విడుదలైన తెలుగు చిత్రం ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’తో తొలి విజయాన్ని అందుకున్నారు. ఆ సినిమా తర్వాత ఆమెకు తెలుగులో అవకాశాలు వరుస కట్టాయి. ప్రస్తుతం తెలుగుతోపాటు బాలీవుడ్‌లోనూ రాణిస్తున్నారు. ఈ సంక్రాంతికి ‘అయలాన్‌’తో పలకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని