Rakul Preet Singh: పదేళ్ల కెరీర్‌పై రకుల్‌ పోస్ట్‌.. ఏం చెప్పారంటే..?

బాలీవుడ్‌లో తన కెరీర్‌ను ఉద్దేశించి పోస్ట్‌ పెట్టారు నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh).

Published : 10 Jan 2024 17:54 IST

ముంబయి: హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి పదేళ్లు పూర్తైన సందర్భంగా నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh) ఆనందం వ్యక్తం చేశారు. తొలి చిత్రం (హిందీలో) ‘యారియాన్‌’ పోస్టర్‌ షేర్‌ చేసిన ఆమె.. ‘‘ఎన్నో అందమైన కలలతో పదేళ్ల క్రితం బాలీవుడ్‌లో తొలి అడుగు వేశా. శ్రమ, పట్టుదలతో ఈ స్థాయికి రాగలిగా. నటిగా సాధించాల్సింది ఇంకా ఎంతో ఉంది. ‘యారియాన్‌’లో వర్క్ చేసినందుకు సంతోషిస్తున్నా. కలల సాకారంలో నాకు అండగా నిలిచిన వారికి ధన్యవాదాలు’’ అని తెలిపారు. #pictureabhibaakihaimeredost అనే హ్యాష్‌ట్యాగ్‌ జత చేశారు. దీనిపై పలువురు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘కంగ్రాట్స్‌’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

న్యూదిల్లీకి చెందిన రకుల్‌.. కన్నడ సినిమా ‘గిల్లీ’తో నటిగా ఎంట్రీ ఇచ్చారు. 2014లో విడుదలైన ‘యారియాన్‌’తో ఆమె బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లోనూ రాణిస్తున్నారు. ఆమె నటించిన ‘అయలాన్‌’ విడుదలకు సిద్ధంగా ఉంది. వ్యక్తిగత విషయానికి వస్తే.. రకుల్‌ త్వరలో వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. బీటౌన్‌ నిర్మాత, నటుడు జాకీ భగ్నానీతో పెళ్లి జరగనుందంటూ ప్రచారం జరుగుతోంది. ఫిబ్రవరి రెండో వారంలో గోవా వేదికగా వివాహం చేసుకోనున్నారని సమాచారం. కల్యాణవేదిక వద్దకు సెల్‌ఫోన్లు తీసుకురావొద్దని ఇప్పటికే బంధువులకు సూచించారట.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని