Ram: 1500 మంది డ్యాన్సర్లతో పాట
రామ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత.
రామ్ (Ram) కథానాయకుడిగా బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. శ్రీలీల కథానాయిక. ఈ సినిమా ముగింపు దశ చిత్రీకరణలో ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన ఓ భారీ సెట్‌లో రామ్, శ్రీలీలపై పాట తెరకెక్కిస్తున్నారు. దాదాపు 1500మంది డ్యాన్సర్లు దీంట్లో పాల్గొంటున్నట్లు తెలిసింది. దీనికి ప్రేమ్ రక్షిత్ నృత్యరీతులు సమకూరుస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఈ గీతం పూర్తి కానుంది. దీని తర్వాత మరో రెండు పాటలు చిత్రీకరించి.. జూన్ నెలాఖరు నాటికి సినిమా ముగించనున్నారు. దసరా సందర్భంగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నెల 15న రామ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర తొలి గ్లింప్స్‌ను విడుదల చేయనున్నారు. అలాగే రామ్-పూరి జగన్నాథ్‌ల కొత్త ప్రాజెక్ట్‌ను అదే రోజు అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిసింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
నయన చిత్రం.. ప్రతీకార నేపథ్యం
-
Ap-top-news News
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
-
Sports News
బ్యాటింగ్ ఎంచుకోవాల్సింది: మాజీ కోచ్ రవిశాస్త్రి
-
World News
భారతీయులకు వీసాల మంజూరులో జాప్యమేల?
-
Crime News
ప్రియుడి మర్మాంగం కోసిన యువతి
-
Ts-top-news News
భారత్‌లో మహిళలకు బైపాస్ సర్జరీ అనంతర ముప్పు తక్కువే!