RC17: రామ్ చరణ్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. మరోసారి రిపీట్‌ కానున్న హిట్‌ కాంబో

రామ్‌ చరణ్‌ కొత్త చిత్రం ప్రకటించారు. స్టార్‌ దర్శకుడితో కలిసి మరో ప్రాజెక్టుకు (#RC17) శ్రీకారం చుట్టారు.

Updated : 25 Mar 2024 16:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అగ్ర కథానాయకుడు రామ్ చరణ్‌ (Ram Charan) అభిమానులకు మైత్రీ మూవీస్‌ సంస్థ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. స్టార్‌ దర్శకుడు సుకుమార్‌ (Sukumar)- రామ్‌ చరణ్‌ల కాంబోలో సినిమా రానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. హోలీ సందర్భంగానే ఈ ప్రాజెక్ట్‌ను మేకర్స్‌ ప్రకటించారు. ‘గొప్ప పని కోసం శక్తిమంతమైన శక్తులు మళ్లీ కలుస్తున్నాయి’ అంటూ గుర్రం బొమ్మ ఉన్న పోస్టర్‌ను షేర్‌ చేశారు. భారతీయ చిత్ర పరిశ్రమను మరింత కలర్‌ఫుల్‌ చేసేందుకు RC17 రానుందని తెలిపారు. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో హిట్‌ కాంబో మరోసారి రిపీట్‌ కానుందంటూ అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు.

ప్రస్తుతం ఈ హీరో బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ చిత్రంలో (RC16) నటిస్తున్నారు. స్పోర్ట్స్‌ డ్రామాగా... గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో ఇది సిద్ధం కానుంది. ఇందులో జాన్వీకపూర్‌ హీరోయిన్‌. శివరాజ్‌కుమార్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. రెహమాన్ స్వరాలు అందించనున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ చిత్రం రెగ్యులర్‌ షూట్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇందులో బాలీవుడ్‌ నటుడు  సంజయ్‌దత్‌ ప్రతినాయకుడిగా కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు శంకర్‌ దర్శకత్వంలో ‘గేమ్‌ ఛేంజర్‌’లో రామ్‌ చరణ్‌ నటిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని