Sharwanand: ఘనంగా హీరో శర్వానంద్ నిశ్చితార్థం
జీవితంలోని కొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతున్నారు నటుడు శర్వానంద్ (Sharwanand). త్వరలోనే ఆయన ఓ ఇంటివాడు కానున్నారు.
హైదరాబాద్: హీరో శర్వానంద్ (Sharwanand) త్వరలో తన సింగిల్ లైఫ్‌కు ఫుల్‌స్టాప్ పెట్టనున్నారు. రక్షితా రెడ్డితో ఆయన ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టనున్నారు. తాజాగా ఈ జంటకు నిశ్చితార్థం జరిగింది. ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో గురువారం ఉదయం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో జరిగిన ఈ వేడుకలో చిరంజీవి దంపతులు, అక్కినేని నాగార్జున దంపతులు, రామ్‌చరణ్ దంపతులు, నాని, రానా, అల్లరి నరేశ్, సిద్ధార్థ్, నితిన్, శ్రీకాంత్, తరుణ్, నవీన్, అదితిరావు హైదరి తదితరులు పాల్గొన్నారు. కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన ఓ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు.. కొత్త జంటకు విషెస్ చెబుతున్నారు.
శర్వానంద్‌కు కాబోయే భార్య రక్షిత సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. ఆమె తండ్రి మధుసూదన్‌రెడ్డి. ఆయన హైకోర్టు లాయర్. తల్లి సుధారెడ్డి. పెళ్లి తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.
ఇకపోతే ఈ హీరో సినిమాల విషయానికి వస్తే.. ‘ఒకే ఒక జీవితం’ విజయం తర్వాత శర్వానంద్ నుంచి కొత్త ప్రాజెక్ట్‌లకు సంబంధించిన అప్‌డేట్‌లు ఏమీ బయటకు రాలేదు. పెళ్లి పనుల్లో బిజీగా ఉండటంతోనే ఆయన కొంత విరామం తీసుకున్నారని.. త్వరలోనే కొత్త సినిమాల గురించి ప్రకటిస్తారని సమాచారం.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
America: ‘ఆయుధాలు ఇచ్చి ఆహారధాన్యాలు తీసుకో’.. రష్యా తీరుపై అమెరికా ఆందోళన..!
-
India News
Chandigarh University: పరీక్షలో పాటలే సమాధానాలు.. లెక్చరర్ కామెంట్‌కు నవ్వులే నవ్వులు
-
India News
Plant Fungi: మనిషికి సోకిన ‘వృక్ష శీలింధ్రం’.. ప్రపంచంలోనే తొలి కేసు భారత్‌లో!
-
Crime News
AI Chatbot: వాతావరణ మార్పులపై ఏఐ చాట్‌బాట్ రిజల్ట్.. ఆందోళనతో వ్యక్తి ఆత్మహత్య!
-
Movies News
Aditya Om: ఇంకా బతికే ఉన్నారా? అని కామెంట్ చేసేవారు: ఆదిత్య ఓం
-
Politics News
Yediyurappa: వరుణ నుంచి కాదు.. నా సీటు నుంచే విజయేంద్ర పోటీ: యడియూరప్ప క్లారిటీ!