Ram Charan: క్లీంకారకు బీచ్‌ని పరిచయం చేసిన రామ్‌చరణ్‌.. ఫొటోలు వైరల్‌

రామ్‌ చరణ్‌ దంపతులు వైజాగ్‌ బీచ్‌కు వెళ్లారు. సంబంధిత దృశ్యాలను ఉపాసన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

Published : 20 Mar 2024 00:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌ ప్రముఖ హీరో రామ్‌ చరణ్‌ (Ram Charan) ఫ్యామిలీ విశాఖపట్నంలో సందడి చేసింది. అక్కడి బీచ్‌కెళ్లి కాసేపు సేద తీరింది. సంబంధిత ఫొటోలను ఉపాసన (upasana) సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. వైజాగ్‌ తమ హృదయాలను దోచుకుందని, క్లీంకార బీచ్‌ వాతావరణాన్ని ఆస్వాదించడం తొలిసారి అంటూ ఆమె ఆనందం వ్యక్తం చేశారు. తమ గారాలపట్టితో చరణ్‌ ఆడుకోవడానికి సంబంధించిన విజువల్స్‌ను స్క్రీన్‌షాట్‌ తీసి, పలువురు ఫ్యాన్స్‌ ‘ఎక్స్‌’ (ఇంతకుముందు ట్విటర్‌)లో పోస్ట్‌ చేస్తూ ‘క్యూట్‌ ఫ్యామిలీ’ అని కామెంట్లు పెడుతున్నారు. చరణ్‌ కుటుంబం తిరిగి హైదరాబాద్‌ చేరుకుంది.

రామ్‌ చరణ్‌ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు తెరకెక్కించనున్న మూవీ బుధవారం ఉదయం హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. #RC16 వర్కింగ్‌ టైటిల్‌. ఇందులో చరణ్‌ సరసన జాన్వీ కపూర్‌ సందడి చేయనుంది. ప్రస్తుతం చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’లో నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు శంకర్‌ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. కియారా అడ్వాణి హీరోయిన్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని