Double Ismart: ఇస్మార్ట్‌ కౌంట్‌డౌన్‌

వంద రోజుల్లో ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ సందడి షురూ అవుతోందంటూ కౌంట్‌డౌన్‌ పోస్టర్‌ని విడుదల చేసింది చిత్రబృందం. రామ్‌ పోతినేని కథానాయకుడిగా... పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది.

Updated : 30 Nov 2023 06:37 IST

వంద రోజుల్లో ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ సందడి షురూ అవుతోందంటూ కౌంట్‌డౌన్‌ పోస్టర్‌ని విడుదల చేసింది చిత్రబృందం. రామ్‌ పోతినేని కథానాయకుడిగా... పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. సంజయ్‌దత్‌ ముఖ్యభూమిక పోషిస్తున్నారు. ఛార్మి కౌర్‌తో కలిసి పూరి జగన్నాథ్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ముంబయిలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదనీ, ఇదివరకు ప్రకటించినట్టుగానే మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు బుధవారం సినీ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. ప్రత్యేకమైన పోస్టర్‌ని కూడా విడుదల చేశాయి. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’కి స్వరాలు సమకూర్చిన మణిశర్మ ఈ చిత్రానికీ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు సినీవర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని