RAM: రామ్‌-బోయపాటి డబ్బింగ్‌ షురూ

దసరా సందడి కోసం శరవేగంగా ముస్తాబవుతోంది రామ్‌ పోతినేని చిత్రం. బోయపాటి శ్రీను దర్శకత్వంలో... శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమా అక్టోబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated : 08 May 2023 13:57 IST

దసరా సందడి కోసం శరవేగంగా ముస్తాబవుతోంది రామ్‌ పోతినేని చిత్రం. బోయపాటి శ్రీను దర్శకత్వంలో... శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమా అక్టోబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్‌కి జోడీగా శ్రీలీల నటిస్తున్నారు. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఒకవైపు చిత్రీకరణ చేస్తూనే, మరోవైపు డబ్బింగ్‌ కార్యక్రమాల్ని మొదలుపెట్టింది చిత్రబృందం. ఇది పలు భాషల్లో విడుదల కానుంది. ఇటీవలే ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ఈ నెల 15న రామ్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా సినిమా పేరు, ప్రచార చిత్రాల్ని విడుదల చేసే అవకాశాలున్నాయి. దీనికి సంగీతం: తమన్‌, ఛాయాగ్రహణం: సంతోష్‌ డిటాకే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని