Ram: రామోజీ ఫిల్మ్‌సిటీలో రామ్‌- బోయపాటి హంగామా

బాలకృష్ణతో ‘అఖండ’ లాంటి భారీ విజయం తర్వాత బోయపాటి శ్రీను (Boyapati Srinu) యువ కథానాయకుడు రామ్‌ (Ram)తో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తోన్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది.

Updated : 07 Apr 2023 07:02 IST

బాలకృష్ణతో ‘అఖండ’ లాంటి భారీ విజయం తర్వాత బోయపాటి శ్రీను (Boyapati Srinu) యువ కథానాయకుడు రామ్‌ (Ram)తో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తోన్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. ప్రత్యేకంగా తీర్చిదిద్దన సెట్లో రామ్‌, శ్రీకాంత్‌, ఇంద్రజ, సయీ మంజ్రేకర్‌ తదితరులపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. మరో నాలుగు రోజుల పాటు ఇక్కడే కోర్టు, పోలీస్‌ స్టేషన్‌ నేపథ్యంలో సాగే సీన్లను చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. బోయపాటి సినిమా అనగానే మాస్‌ ప్రేక్షకులు ఊగిపోయేలా ఉంటుంది. దానికి రామ్‌ తోడైతే సినిమా ఓ రేంజ్‌లో ఉండబోతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని