#RaPo20: పవర్‌ ఫుల్‌ డైలాగుతో టైటిల్‌ ప్రకటించిన రామ్‌...

రామ్ - బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబోలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. తాజాగా చిత్రబృందం దీని టైటిల్‌ను ఖరారు చేసింది.

Updated : 03 Jul 2023 14:09 IST

హైదరాబాద్‌: బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో రామ్‌ పోతినేని (Ram Pothineni) ఓ సినిమాలో చేస్తున్న విషయం తెలిసిందే. వరుస అప్‌డేట్‌లతో సందడి చేస్తోన్న చిత్ర బృందం తాజాగా ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించింది. #RaPo20 అనే వర్కింగ్‌ టైటిల్‌ ప్రచారంలో ఉన్న ఈ మూవీకి ‘స్కంద’ అనే పేరు ఖరారు చేసింది. ఈ మేరకు చిత్రబృందం గ్లింప్స్‌ను విడుదల చేసింది. మాస్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్‌ సరసన శ్రీలీల నటించింది.

టీజర్‌లో రామ్‌ చెప్పిన ‘‘మీరు దిగితే ఊడేదుండదు.. నేను దిగితే మిగిలేదుండదు’’ డైలాగ్‌ సినిమా ఎంత మాస్‌గా ఉంటుందో చెప్పేలా ఉంది. ఈ సినిమాను అనుకున్న సమయం కంటే ముందే విడుదల చేస్తున్నట్లు ఇటీవల మూవీ యూనిట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌ 15న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రంలో క్లైమాక్స్‌ సన్నివేశాలు హైలైట్‌ కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో రామ్ పాన్‌ ఇండియా మార్కెట్‌లోకి అడుగుపెట్టనున్నాడు. తమన్‌ స్వరాలు అందిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు మరో నాలుగు భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.

ఇదిలా ఉండగా, ‘స్కంద’ పూర్తయిన తర్వాత పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) దర్శకత్వంలో రామ్‌ నటించనున్నాడు.  ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సీక్వెల్‌గా ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ (Double Ismart) పేరుతో ఈ సినిమా తెరకెక్కనుంది. పాన్‌ ఇండియా మూవీగానే రానున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 8న విడుదలవుతుంది. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు సమాచారం. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని