Ram Pothineni: దిమాక్‌ కిరికిరి

‘కిరాక్‌ పోరి వస్తే సైట్‌ మార్‌... ఖతర్నాక్‌ బీట్‌ వస్తే స్టెప్పా మార్‌... ఇదే నా స్టైల్‌’ అంటున్నాడు ఉస్తాద్‌ ఇస్మార్ట్‌ శంకర్‌ అలియాస్‌ డబుల్‌ ఇస్మార్ట్‌.

Updated : 16 May 2024 09:33 IST

కిరాక్‌ పోరి వస్తే సైట్‌ మార్‌... ఖతర్నాక్‌ బీట్‌ వస్తే స్టెప్పా మార్‌... ఇదే నా స్టైల్‌’ అంటున్నాడు ఉస్తాద్‌ ఇస్మార్ట్‌ శంకర్‌ అలియాస్‌ డబుల్‌ ఇస్మార్ట్‌. మరి ఈ శంకర్‌  దిమాక్‌ కిరికిరి కథేమిటో తెలియాలంటే ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ చూడాల్సిందే. రామ్‌ పోతినేని  కథానాయకుడిగా... పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. కావ్యా థాపర్‌ కథానాయిక.  ‘ఇస్మార్ట్‌ శంకర్‌’కి కొనసాగింపుగా తెరకెక్కుతోంది. బాలీవుడ్‌ స్టార్‌ సంజయ్‌ దత్‌ కీలక పాత్రని పోషిస్తున్నారు. పూరి జగన్నాథ్‌, ఛార్మి కౌర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రామ్‌ పుట్టినరోజు సందర్భంగా బుధవారం దిమాక్‌ కిరికిరి పేరుతో టీజర్‌ని విడుదల చేశా. ఆధ్యాత్మికతని ముడిపెడుతూ ఈ సినిమాని తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ‘‘నాకు తెల్వకుండా నాతో సినిమా ప్లాన్‌ చేస్తే...’’ అంటూ రామ్‌ చేసిన సందడి, ఆయన హుషారు, యాక్షన్‌ ఘట్టాలు, విజువల్స్‌ టీజర్‌కి ఆకర్షణగా నిలిచాయి. ‘‘ప్రేక్షకులకు డబుల్‌ డోస్‌ వినోదాన్ని పంచే చిత్రమిది. రామ్‌ యాక్షన్‌, ఆయన స్టైలిష్‌ అవతారం, చెప్పే సంభాషణలు చిత్రానికి ప్రధాన ఆకర్షణ. బిగ్‌ బుల్‌గా సంజయ్‌ దత్‌ నటన, ఆయన పాత్ర అలరిస్తాయి. అలీ చేసే హంగామా వినోదం పంచుతుంద’’ని సినీ వర్గాలు తెలిపాయి. అలీ, గెటప్‌ శ్రీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: శ్యామ్‌ కె.నాయుడు, జియాని జియాన్నెలి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు