Ram pothineni: అసలైన విజయమంటే అదే.. బర్త్‌డే రోజు రామ్‌ ఆసక్తికర పోస్ట్‌

మనకు నచ్చింది చేయగలగడమే అసలైన విజయమని రామ్ పోతినేని అన్నారు.

Published : 15 May 2024 17:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ టీజర్‌తో ఫ్యాన్స్‌లో జోష్‌ పెంచారు రామ్ పోతినేని. నేడు ఈ యంగ్‌ హీరో పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులకు ధన్యవాదాలు చెబుతూ రామ్ (Ram pothineni) కూడా ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు.

‘యాక్టింగ్‌ స్కూల్‌ నుంచి షార్ట్‌ ఫిల్మ్‌ల వరకు... అక్కడినుంచి ఫీచర్‌ సినిమాల వరకు.. ఇలా మన జీవితంలో మనం అనుకున్నట్లు జీవించడమే అసలైన విజయం. మనం ప్రేమించే పనిని చేయగలగాలి. ఎక్కువశాతం నచ్చినట్లు ఉండాలి. ఏది చేస్తే ఆనందంగా ఉంటామో దాన్ని చేయగలగడమే పెద్ద సక్సెస్‌. ఏది చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందో అది చేయడమే జీవితానికి అర్థం. ఏది చేసినా సంతోషంగా ఉండడం ముఖ్యం. ఇన్నేళ్ల నా ప్రయాణంలో భాగమైనందుకు అందరికీ ధన్యవాదాలు. నన్ను ఆశీర్వదిస్తూ.. ఎప్పుడూ నాతో ఉంటున్నందుకు, నాపై ఇంత ప్రేమ చూపుతున్నందుకు కృతజ్ఞతలు’ అని రాసుకొచ్చారు.

ఇలా చేయడం సరికాదు: ‘సెపరేషన్‌’ పోస్ట్‌ ట్రోల్స్‌పై జీవీ ప్రకాశ్‌

ప్రస్తుతం రామ్‌ ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ ప్రమోషన్‌తో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) దర్శకత్వంలో ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సీక్వెల్‌గా ఇది రూపొందుతోంది. తాజాగా దీని టీజర్‌ను విడుదల చేయగా అది విశేషంగా ఆకట్టుకుంటోంది. పాన్‌ఇండియా స్థాయిలో ఈ సీక్వెల్‌ విడుదల కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకురానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని