OTT Movies: ఓటీటీలో ‘రామ్‌సేతు’.. ‘ఊర్వశివో రాక్షసివో’ ఎప్పుడంటే?
అక్షయ్‌కుమార్ నటించిన ‘రామ్‌సేతు’.. అల్లు శిరీష్-అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన ‘ఊర్వశివో రాక్షసివో’ చిత్రాలు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి.
హైదరాబాద్: అక్షయ్‌కుమార్ కీలక పాత్రలో నటించిన యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘రామ్‌సేతు’. అక్టోబరు 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిసెంబరు 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా చూడాలంటే అద్దె ప్రాతిపదికన రూ.199 చెల్లించి చూడాలి. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఆడియోను ఎంపిక చేసుకోవచ్చు. ఇక ఎలాంటి అద్దె చెల్లించకుండా ఎప్పటి నుంచి స్ట్రీమింగ్‌కు తీసుకొస్తారో వేచి చూడాల్సి ఉంది. బహుశా రెండు వారాల తర్వాత రామ్‌సేతును ప్రైమ్ చందాదారులందరూ చూడవచ్చు. అభిషేక్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్, జాక్వెలైన్, నుస్రత్‌లు నటించారు.
అల్లు శిరీష్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ కూడా వచ్చేస్తోంది
యంగ్ హీరో అల్లు శిరీష్ (Allu Sirish), అను ఇమ్మాన్యుయేల్ (Anu Emmanuel) జంటగా నటించిన సినిమా ‘ఊర్వశివో రాక్షసివో’ (Urvasivo Rakshasivo). రాకేశ్ శశి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చి యువతను బాగా ఆకట్టుకుంది. డిసెంబర్ 9 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ప్రీమియర్ కానుంది. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా ప్రకటించారు. థియేటర్లో చూడలేకపోయిన వారు ఈనెల 9 నుంచి ఆహాలో చూసేయచ్చు. ధీరజ్ మొగిలినేని, తమ్మారెడ్డి భరద్వాజ, విజయ్.ఎం నిర్మించిన ఈ సినిమాలో వెన్నెల కిషోర్, సునీల్, పృథ్వీ, ఆమని, కేదార్ శంకర్, పోసాని కృష్ణమురళి, తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు.
కథేంటంటే: శ్రీకుమార్ (అల్లు శిరీష్) మధ్య తరగతి కుటుంబానికి చెందిన కుర్రాడు. సింధూజ (అను ఇమ్మాన్యుయేల్) అమెరికాలో పనిచేసి భారత్‌కు తిరిగొచ్చిన అమ్మాయి. ఇద్దరూ ఒకే సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తుంటారు. సింధూని చూసి మనసు పారేసుకుంటాడు శ్రీకుమార్. ఆధునిక భావాలున్న ఆమె కూడా తక్కువ సమయంలోనే అతడికి దగ్గరవుతుంది. ఇద్దరూ శారీరకంగా ఒక్కటయ్యాక శ్రీ తన ప్రేమని వ్యక్తం చేస్తాడు. ఆమె మాత్రం ప్రేమించడం లేదని చెబుతుంది. మరి మనసులో ప్రేమ లేకుండానే శ్రీకి సింధు ఎలా దగ్గరైంది? ఇద్దరూ కలిసి సహజీవనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఏం చేశారు? వారిద్దరికీ పెళ్లైందా? లేదా? తదితర విషయాల్ని తెరపై చూడాల్సిందే.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs AUS: విరాట్‌ని ఆపకపోతే ఆస్ట్రేలియా గెలవడం చాలా కష్టం: ఆసీస్ మాజీ కెప్టెన్
-
India News
Cow Hug day: ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే కాదు.. కౌ హగ్ డే..!
-
World News
Operation Dost: విభేదాలున్నా.. తుర్కియేకు భారత్ ఆపన్నహస్తం..!
-
Movies News
Social Look: రుహానీ శర్మ రెడ్ రోజ్.. ప్రణీతకు బోర్ కొడితే?
-
General News
Andhra News: సీబీఐ విచారణ కోరుతూ రఘురామ పిటిషన్.. కేంద్రం, సీబీఐకి నోటీసులు జారీ
-
Movies News
Dhanush: ఈ రోజు నాకెంతో ప్రత్యేకం: ధనుష్