Ram Charan: రామ్‌చరణ్‌కు గౌరవ డాక్టరేట్‌

‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు రామ్‌చరణ్‌ (Ram Charan).

Published : 11 Apr 2024 16:06 IST

హైదరాబాద్‌: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో విశేష ఆదరణ సొంతం చేసుకున్న రామ్‌చరణ్‌ (Ram Charan) తాజాగా మరో గౌరవాన్ని దక్కించుకున్నారు. చెన్నైకు చెందిన వేల్స్‌ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్‌ ప్రకటించింది. ఈమేరకు ఏప్రిల్‌ 13న జరగనున్న విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. కళా రంగానికి చరణ్‌ చేస్తున్న సేవలను గుర్తించి డాక్టరేట్ అందిస్తున్నట్లు స్థానిక ప్రతికల్లో వార్తలు వచ్చాయి. దీనిపై ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘ఆచార్య’ తర్వాత రామ్‌చరణ్‌ నటిస్తోన్న చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. శంకర్‌ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో కియారా అడ్వాణీ కథానాయిక. పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఇది సిద్ధమవుతోంది. అంజలి, ఎస్‌.జె.సూర్య, జయరామ్‌, సునీల్‌, నాజర్‌, శ్రీకాంత్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో సిద్ధమవుతోన్న ఈ చిత్రాన్ని వినాయక చవితి కానుకగా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబుతో చరణ్‌ ఇటీవల కొత్త చిత్రాన్ని అనౌన్స్‌ చేశారు.  జాన్వీకపూర్‌ కథానాయిక. దీని తర్వాత సుకుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని