Rana: ‘రానా నాయుడు’.. క్షమాపణలు చెప్పిన రానా
‘రానా నాయుడు’ (Rana Naidu) సిరీస్‌కు పలువురు నెటిజన్ల నుంచి వస్తోన్న విమర్శలపై నటుడు రానా (Rana) స్పందించారు. సిరీస్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న వారికి రానా సారీ చెప్పారు.
హైదరాబాద్: ‘రానా నాయుడు’ (Rana Naidu) సిరీస్‌ను అసహ్యించుకుంటోన్న వారికి నటుడు రానా (Rana) క్షమాపణలు చెప్పారు. మరోవైపు ఈ క్రైమ్, యాక్షన్ డ్రామా నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్‌లోకి రావడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. తమ సిరీస్‌కు ఇంతటి ఆదరణ అందించిన సినీ ప్రియులకు ధన్యవాదాలు చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఉదయం ట్వీట్ చేశారు. అలాగే, ఈ సిరీస్‌ను కుటుంబంతో కాకుండా ప్రతి ఒక్కరూ ఒంటరిగా చూడాలని మరోసారి స్పష్టం చేశారు.
వెంకటేశ్ (Venkatesh), రానా (Rana) ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన సరికొత్త వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ (Rana Naidu). సుప్రన్ వర్మ, కరణ్ అన్షుమన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రేక్షకులకు అందుబాటులో ఉంది. మార్చి 10న విడుదలైన ఇది సుమారు రెండు రోజుల్లోనే నెట్‌ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్ లిస్ట్‌లోకి చేరింది. ఇదే విషయాన్ని సదరు ఓటీటీ ప్లాట్‌ఫామ్ తెలియజేసింది. భారత్ టాప్ ట్రెండింగ్ షోల్లో ‘రానా నాయుడు’ ప్రథమ స్థానంలో ఉన్నట్లు వెల్లడించింది. దీనిపై తాజాగా రానా స్పందించారు. అయితే, ఈ సిరీస్‌లో శ్రుతిమించిన శృంగార సన్నివేశాలు, అసభ్య పదజాలం ఉందని పలువురు నెటిజన్ల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. మంచి ఇమేజ్‌ని పక్కన పెట్టి వెంకీ, రానా ఇలాంటి సిరీస్‌లో నటించడాన్ని వాళ్లు తప్పుబట్టారు. రానా- వెంకీ నుంచి ఇలాంటిది ఊహించలేదని.. కుటుంబంతో కలిసి దీన్ని చూడలేకపోతున్నామని.. ట్వీట్స్ పెట్టారు. ఈ క్రమంలో రానా (Rana) వాళ్లందరికీ సారీ చెప్పారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
TS Millet man: ‘తెలంగాణ మిల్లెట్ మ్యాన్’ పీవీ సతీశ్ ఇక లేరు
-
World News
Kailasa: ‘కైలాస.. సరిహద్దులు లేని దేశం..!’
-
Politics News
Sajjala: ఒక్కోసారి వైకాపా అధికారంలో ఉందా? లేదా? అన్న ఆలోచన వస్తోంది: సజ్జల
-
Politics News
Akhilesh Yadav: కాంగ్రెస్ పనైపోయింది.. భాజపా పరిస్థితి అదే..!
-
Sports News
IND vs AUS: అదే మమ్మల్ని వెనుకడుగు వేసేలా చేసింది: రోహిత్ శర్మ