Rana: ‘నేనే రాజు నేనే మంత్రి’ తర్వాత తేజ-రానా కొత్త చిత్రం.. టైటిల్‌ ఇదే!

rakshasa raja: రానా, తేజ కాంబోలో ఓ కొత్త చిత్రం పట్టాలెక్కింది.

Updated : 14 Dec 2023 16:27 IST

హైదరాబాద్‌: రానా (Rana) కథానాయకుడిగా తేజ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’ (Nene Raju Nene Mantri). సమకాలీన రాజకీయాలపై తేజ టేకింగ్‌, రానా నటన సినిమాను విజయ పథంలో నడిపాయి. వీరి కాంబినేషన్‌లో మరో సినిమా ఉంటుందని ఇప్పటికే తేజ ప్రకటించారు. అన్నట్లుగానే ఇందుకు సంబంధించిన సినిమాను మొదలు పెట్టారు. ‘రాక్షస రాజా’ (Rakshasa Raja) పేరుతో కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించినట్లు రానా తెలిపారు. ఇందులో రానా గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారని ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది. అంతేకాదు, బలమైన భావోద్వేగాలతో కూడిన కథగా దీన్ని తీర్చిదిద్దనున్నట్లు టాక్‌. ఇతర నటీనటులు, సాంకేతిక బృందం వివరాలు తెలియాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని