Rana Daggubati: అప్పుడు పెద్ద సవాలు ఎదుర్కొన్నా.. అందుకే నటుణ్ని అయ్యా: రానా
తాను హీరోగా మారడానికి కారణమేంటో రానా దగ్గుబాటి తెలిపారు. ఓ కార్యక్రమంలో ఆయన పలు విశేషాలు పంచుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: నిర్మాతగా కొనసాగుతున్న సమయంలో తానో పెద్ద సవాలు ఎదుర్కొన్నానని రానా దగ్గుబాటి (Rana Daggubati) తెలిపారు. తాను ఎందుకు నటనపైపు రావాల్సి వచ్చిందో వివరించారు. తాజాగా పాల్గొన్న ఓ కాన్‌క్లేవ్‌లో ఆయన మాట్లాడారు. తాను నిర్మాతగా వ్యవహరించిన తొలి సినిమా ‘బొమ్మలాట’ (Bommalata).. రెండు జాతీయ అవార్డులు గెలుచుకుందని తెలిపారు. నేషనల్ అవార్డ్స్ అందుకున్నా ఇండిపెండెంట్ ఫిల్మ్‌కావడంతో అది థియేటర్లలో విడుదలవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేక్షకులకు తాను చెప్పాలనుకున్న కథలను తీసుకోమని టెక్నిషియన్ల చుట్టూ రెండేళ్లపాటు తిరిగినా ఫలితం లేకపోయిందన్నారు. నిర్మాతగా తాను అనుకున్నది జరగకపోవడంతో నటుడిగా మారానని తెలిపారు. కొత్త కాన్సెప్ట్‌ల ఎంపిక విషయంలో చిత్ర పరిశ్రమను ఒప్పించడం చాలా కష్టమైన పని అని అభిప్రాయపడ్డారు. అయితే, ప్రస్తుతం కొంత మార్పు వచ్చిందని పేర్కొన్నారు.
సినిమాల విషయంలో తనకు చిన్నప్పటి నుంచీ భాషా బేధాల్లేవని స్పష్టం చేశారు. చెన్నైలో పెరిగిన తాను తమిళ్, తెలుగు, మలయాళం, ఇంగ్లిష్ చిత్రాలు చూసినట్టు తెలిపారు. నటుడైన తర్వాత అదే ధోరణితో ఉన్నానన్నారు. భాష కంటే సినిమా కథ ముఖ్యమని పేర్కొన్నారు. చిన్న చిత్రాలైనా కంటెంట్ బాగుంటే రానా హీరో అయిన తర్వాతా వాటిని ప్రోత్సహించేవారు. ‘కేరాఫ్ కంచరపాలెం’, ‘కృష్ణ అండ్ హిజ్ లీల’, ‘777 చార్లి’, ‘గార్గి’ చిత్రాలను సమర్పించారు. తిరువీర్ ప్రధాన పాత్ర పోషించిన ‘పరేషాన్’ (Pareshan) చిత్రం రానా సమర్పణలో జూన్ 2న విడుదల కానుంది. తన బాబాయ్, ప్రముఖ హీరో వెంకటేశ్ (venkatesh)తో కలిసి ‘రానా నాయుడు’ (rana naidu) వెబ్‌సిరీస్‌లో రానా సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ ఓటీటీ (ott) ‘నెట్‌ఫ్లిక్స్’ (netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu : క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఆదేశాలను సుప్రీంలో సవాల్ చేసిన చంద్రబాబు
-
Narendra Modi: శివతత్వం ప్రతిబింబించేలా వారణాసి క్రికెట్ స్టేడియం..
-
Crime News: కుమారుడిని చంపి.. ఇంటి ముందు పడేసి: ‘మీ సింహమిదిగో’ అంటూ హేళన
-
Nani: అప్పుడే మొదటి సారి ప్రేమలో పడ్డా.. ప్రస్తుతం తనే నా క్రష్: నాని
-
Madhapur Drugs Case: నటుడు నవదీప్‌ను ప్రశ్నిస్తున్న నార్కోటిక్స్ పోలీసులు
-
USA: కెనడా-ఇండియా ఉద్రిక్తతలు.. అమెరికా మొగ్గు ఎటువైపో చెప్పిన పెంటాగన్ మాజీ అధికారి