Janhvi Kapoor: ఫ్యాషన్ పోలీస్‌తో జాన్వీకి కొత్త తలనొప్పి.. సమస్యను తీర్చిన రానా
వెంకటేశ్, రానా తొలిసారి కలిసి నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ (Rana Naidu). అమెరికన్ టీవీ సిరీస్ ‘రే డొనోవన్’కు రీమేక్‌గా ఇది తెరకెక్కింది.
ముంబయి: అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి (Sri Devi) కుమార్తె జాన్వీకపూర్(Janhvi Kapoor)కు కొత్త తలనొప్పి వచ్చింది. ఫ్యాషన్ పోలీస్ వల్ల ఆమె విసిగిపోయింది. జాన్వి సమస్యను తెలుసుకున్న రానా (Rana) రంగంలోకి దిగారు. ఆమెకు అండగా నిలిచి సమస్యను తీర్చారు. జాన్వికి వచ్చిన ఇబ్బంది ఏంటి? ఆమెకు రానా ఎందుకు సాయం చేశారు? ఈ ఫ్యాషన్ పోలీస్ ఎవరు? అని అనుకుంటున్నారా..!
రానా (Rana) - వెంకటేశ్ (Venkatesh) ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్, క్రైమ్ ఎంటర్‌టైనర్ ‘రానా నాయుడు’ (Rana Naidu). ఇందులో రానా సెలబ్రిటీల సమస్యలు తీర్చే వ్యక్తిగా కనిపించనున్నారు. నెట్‌ఫ్లిక్స్ వేదికగా మరో ఐదు రోజుల్లో ఈ సిరీస్ ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది. ఈ నేపథ్యంలోనే ‘రానా నాయుడు’ ప్రమోషన్స్‌లో కొంతమంది సెలబ్రిటీలతో టీమ్ స్పెషల్ వీడియోలు ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా, జాన్వీకపూర్, రానాపై చిత్రీకరించిన ఓ వీడియోను తాజాగా విడుదల చేసింది.
ఫ్యాషన్ పోలీస్ (ట్రెండ్‌కు అనుగుణంగా సెలబ్రిటీలు దుస్తులు ధరిస్తున్నారో లేదోనని చెప్పే ఊహాజనిత బృందం)తో విసిగిపోయిన జాన్వి రానాను సంప్రదించినట్లు ఈ వీడియోలో చూపించారు. ‘మీ సమస్య ఏమిటి? చెప్పండి’ అని రానా అడగ్గా.. ‘సర్, పోలీసులు నా వెంట పడుతున్నారు’ అని ఆమె బదులిస్తుంది. ‘దిల్లీ పోలీసా? ముంబయి పోలీసా? గోవా పోలీసా? పుణె పోలీసా?’ అని ఆయన ప్రశ్నించగా.. ‘లేదు సర్. ఫ్యాషన్ పోలీస్.. ఇప్పటికే ఎన్నో ట్రెండ్స్ ప్రయత్నించినప్పటికీ.. ఎయిర్‌పోర్ట్‌లో నేను కనిపించగానే ఫ్యాషన్ పోలీస్ నా వెంట పడుతోంది’ అంటూ తన ఇబ్బందిని బయటపెట్టగా.. ఆయన ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి సమస్యను పరిష్కరించారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో ఈ వీడియోలో చూసేయండి..!
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Dasara: ‘దసరా’ సెన్సార్ రిపోర్టు.. మొత్తం ఎన్ని కట్స్ అంటే?
-
Sports News
Rishabh Pant: రిషభ్ పంత్‌కు అరుదైన గౌరవం ఇవ్వనున్న దిల్లీ క్యాపిటల్స్!
-
World News
Rishi Sunak: ఇంగ్లాండ్ ఆటగాళ్లతో క్రికెట్ ఆడిన రిషిసునాక్.. వీడియో వైరల్
-
India News
America: అశ్లీల వీడియోలు సరఫరా.. భారతీయుడికి 188 నెలల జైలు..!
-
Sports News
Surya - Samson: సూర్య కుమార్‌ను సంజూ శాంసన్‌తో పోల్చొద్దు... ఎందుకంటే: కపిల్ దేవ్
-
Movies News
Social Look: నెల తర్వాత నివేదా పోస్ట్.. కీర్తి సురేశ్ ‘వెన్నెల’ ఎఫెక్ట్!