Rana : రానా... రాక్షస రాజా

‘నేనే రాజు నేనే మంత్రి’తో విజయాన్ని సొంతం చేసుకున్నారు రానా దగ్గుబాటి - తేజ. ఈ కలయికలో ‘రాక్షస రాజా’ పేరుతో ఓ చిత్రం రూపొందుతోంది. రానా దగ్గుబాటి పుట్టినరోజు సందర్భంగా గురువారం ఈ సినిమాని అధికారికంగా ప్రకటించారు. పూజా కార్యక్రమాల్ని కూడా నిర్వహించినట్టు తెలుస్తోంది.

Updated : 15 Dec 2023 09:39 IST

‘నేనే రాజు నేనే మంత్రి’తో విజయాన్ని సొంతం చేసుకున్నారు రానా దగ్గుబాటి - తేజ. ఈ కలయికలో ‘రాక్షస రాజా’ పేరుతో ఓ చిత్రం రూపొందుతోంది. రానా దగ్గుబాటి పుట్టినరోజు సందర్భంగా గురువారం ఈ సినిమాని అధికారికంగా ప్రకటించారు. పూజా కార్యక్రమాల్ని కూడా నిర్వహించినట్టు తెలుస్తోంది. ‘‘గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇదివరకు ఎప్పుడూ చూడని ఓ నేర ప్రపంచాన్ని తెరపై ఆవిష్కరిస్తున్నాం. కుటుంబ నేపథ్యంలో సాగే డ్రామా కూడా ఈ కథలో కీలకం. అంచనాలకి దీటుగా, రానా ఓ శక్తిమంతమైన పాత్రలో నటిస్తార’’ని సినీ వర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని