Rana: నాకస్సలు బైక్ నడపడమే రాదు: రానా
‘ఉస్తాద్’ టీజర్ విడుదల కార్యక్రమంలో నటుడు రానా (Rana) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు బైకులు నడపడం రాదని చెప్పారు.
హైదరాబాద్: శ్రీసింహా (Srisimha) హీరోగా తెరకెక్కిన సరికొత్త చిత్రం ‘ఉస్తాద్’ (ustaad). ఫణిదీప్ దర్శకుడు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో రానా (Rana) ముఖ్య అతిథిగా పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు బైకులు నడపడం రాదని చెప్పారు. బైక్స్ చక్కగా నడిపేవారంటే తనకు ఇష్టమని రానా అన్నారు.
‘‘ఈ సినిమాలో భాగమైన చాలామందితో నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. ముఖ్యంగా చిత్ర నిర్మాతల గురించి చెప్పాలి. రాకేశ్.. నాతో ‘నంబర్ 1 యారీ’ చేశాడు. హిమాంక్ నా టాలెంట్ ఏజెన్సీ నడిపేవాడు. నాకు తెలిసి.. నా కంటే ఎక్కువగా అతడిని ఎవరూ ఇబ్బందిపెట్టి ఉండరు. ‘బాహుబలి’ నుంచే శ్రీసింహాతో నాకు మంచి అనుబంధం ఉంది. ఈ ఈవెంట్‌లోకి అడుగుపెట్టగానే హీరోయిన్ కావ్య.. ‘సార్.. మీక్కూడా ఏదైనా బైక్ కథ ఉందా?’ అని నన్ను అడిగింది. ఇప్పటికే ఎన్నోసార్లు ఈవిషయాన్ని చెప్పాను. మళ్లీ ఈరోజు చెబుతున్నాను. నాకస్సలు బైకులు నడపడం రాదు. అందువల్లే బైక్స్‌తో నాకంత కనెక్షన్ లేదు. కానీ, బైక్స్, కార్లను బాగా నడిపేవారిని నేను ఇష్టపడతా. ఈ టీమ్ మొత్తానికి ఆల్ ది బెస్ట్. దర్శకుడు ఫణిదీప్ ఇటీవల నా కార్యాలయానికి వచ్చాడు. అతడిని కలవడం అప్పుడే మొదటిసారి.’’ అని రానా వివరించారు. అనంతరం దర్శకుడు ఫణిదీప్ మాట్లాడుతూ.. తాను ‘ఉస్తాద్’ అనే టైటిల్‌ను రెండేళ్ల క్రితమే రిజిస్టర్ చేసినట్టు చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Siddharth: కన్నడ ప్రజల తరపున సిద్ధార్థ్‌కు క్షమాపణలు: ప్రకాశ్ రాజ్
-
Canada: హంతకులకు ఆశ్రయం ఇస్తున్నారు.. కెనడాపై బంగ్లాదేశ్ మంత్రి తీవ్ర ఆరోపణలు
-
Imran Tahir: 44 ఏళ్ల వయసులోనూ తాహిర్ జోరు.. ధోని రికార్డు బద్దలు కొట్టి..
-
Trump: అమెరికాలో ఏదో జరగబోతోంది.. : జోబైడెన్ ఆందోళన
-
Papam Pasivadu Review: రివ్యూ: పాపం పసివాడు.. సింగర్ శ్రీరామ చంద్ర నటించిన వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే?
-
Nara Lokesh - AP High Court: లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ముగిసిన విచారణ