Ramayan: విలువిద్య నేర్చుకుంటోన్న రణ్‌బీర్‌...‘రామాయణం’ కోసమేనా?

బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ విలువిద్యలు నేర్చుకుంటున్నారు. వాటికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Published : 26 Mar 2024 16:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌లో రానున్న ‘రామాయణం’ (Ramayan) సినిమా అప్‌డేట్‌ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి నితీశ్‌ తివారీ దర్శకత్వం వహించనున్నారు. ఇందులో రాముడిగా ప్రముఖ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor), సీతగా సాయి పల్లవి (Sai Pallavi), రావణుడిగా యశ్‌ కనపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా రణ్‌బీర్‌ విలువిద్యలు నేర్చుకుంటూ, వ్యాయామం చేస్తూ ఉన్న ఫొటోలు ఆర్చరీ కోచ్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. రాముడి పాత్రలో రణ్‌బీర్‌ ఖరారైనట్లేనని అభిమానులు భావిస్తున్నారు. రణ్‌బీర్‌, సాయి పల్లవి, యశ్‌లతో పాటు హనుమంతుడిగా సన్నీ దేవోల్‌, కైకేయిగా లారా దత్తా, శూర్పణఖ పాత్రలో రకుల్‌ ప్రీత్‌ పేర్లు వినిపిస్తున్నాయి. ఏప్రిల్‌లో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీరామ నవమి సందర్భంగా చిత్రబృందం అప్‌డేట్‌ ఇవ్వనున్నట్లు వార్తలొస్తున్నాయి.

సందీప్‌ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్‌’ చిత్రంతో బాక్సాఫీస్‌ హిట్‌ అందుకున్నారు రణ్‌బీర్‌ కపూర్. ఈ సినిమాకి సీక్వెల్‌గా రానున్న ‘యానిమల్‌ పార్క్‌’లో నటించనున్నారు. సంజయ్‌ లీలా భన్సాలీ రూపొందించనున్న మల్టీస్టారర్‌ ప్రేమకథా చిత్రంలోనూ కీలక పాత్ర పోషించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని