Rashi Khanna: చరిత్రను మార్చిన సంఘటన

బాలీవుడ్‌ కథానాయకుడు విక్రాంత్‌ మాస్సే, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్‌’. రంజన్‌ చందేల్‌ తెరకెక్కిస్తున్నారు.

Updated : 29 Mar 2024 11:55 IST

బాలీవుడ్‌ కథానాయకుడు విక్రాంత్‌ మాస్సే, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్‌’. రంజన్‌ చందేల్‌ తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్లు తెలిపింది చిత్రబృందం. తాజాగా ఈ సినిమా టీజర్‌ను సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేశాడు విక్రాంత్‌. ‘దేశాన్ని కుదిపేసిన ఘటన. భారతీయ చరిత్రను శాశ్వతంగా మార్చేసిన సంఘటన..‘ది సబర్మతీ రిపోర్ట్‌’’ అని వ్యాఖ్యల్ని జోడించాడు. గోద్రా రైలు దహన కాండ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం మే 3న రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని