Akshay Kumar: అక్షయ్‌తో బ్రేకప్‌.. ఆత్మహత్య వార్తలపై స్పందించిన రవీనా టాండన్‌

అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar)తో వివాహం రద్దు కావడంపై నటి రవీనా టాండన్‌ (Raveena Tandon) స్పందించారు. బ్రేకప్‌ తర్వాత వచ్చిన పలు కథనాల గురించి ఆమె మాట్లాడారు.

Updated : 28 Mar 2024 17:23 IST

ముంబయి: బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar), నటి రవీనా టాండన్‌(Raveena Tandon)కు గతంలో నిశ్చితార్థమైన విషయం తెలిసిందే. అనుకోని కారణాలతో వీరి వివాహం రద్దు అయ్యింది. బ్రేకప్ తర్వాత తాను ఎదుర్కొన్న ఇబ్బందులపై తాజాగా రవీనా టాండన్‌ స్పందించారు. పత్రికలు, మ్యాగజైన్స్‌లో వచ్చిన పలు కథనాలు చూసి తాను షాకయ్యానని అన్నారు. బాధపడ్డానని చెప్పారు.

‘‘అక్షయ్‌తో బ్రేకప్‌ తర్వాత వచ్చిన పలు కథనాలు చూసి నవ్వుకున్నా. చాలా మంది జీవితాల్లో బ్రేకప్స్‌ ఉంటాయి. ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైనా విభేదాలు వచ్చినప్పుడు కొన్నిసార్లు ఆ బంధం అక్కడితో ఆగిపోతుంది. ఎవరి దారులు వాళ్లు చూసుకుంటారు. జీవిత భాగస్వాములుగా కంటే స్నేహితులుగా ఉండొచ్చని గ్రహిస్తారు. చివరకు స్నేహితులుగా ఉంటారు. కాబట్టి.. బ్రేకప్‌లో పెద్ద విషయం ఏముంది. అనారోగ్యంతో ఒకసారి ఆస్పత్రికి వెళితే.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని కథనాలు ప్రచురించారు. తమ పత్రికలను ఎక్కువమందికి చేరువ చేయడం కోసం అప్పట్లో ఇలాంటి కథనాలు ప్రచురించేవారు. కొంతకాలంపాటు వార్తా పత్రికలకు దూరంగా ఉన్నా’’ అని రవీనా టాండన్‌ చెప్పారు.

‘మోహ్రా’ విజయం తర్వాత రవీనాటాండన్‌ - అక్షయ్‌ కుమార్‌ సూపర్‌హిట్‌ జోడీగా బాలీవుడ్‌లో పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే 1995లో వీరిద్దరూ రిలేషన్‌లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత కొంతకాలానికి నిశ్చితార్థం జరిగింది. అయితే అనుకోని కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. తన కోస్టార్‌ ట్వింకిల్‌ ఖన్నాను అక్షయ్‌ 2001లో వివాహం చేసుకున్నారు. అనిల్‌ అనే వ్యాపారవేత్తతో రవీనా టాండన్‌ ఏడడుగులు వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని